Gopichand: ఫ్లాప్ డైరెక్టర్ల పాలిట దేవుడిగా మారిన గోపీచంద్.. ఆ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తున్నారా?

Gopichand: ఇండస్ట్రీలో డైరెక్టర్లు చేసినటువంటి వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్లకు ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్ర వేస్తారు. ఇలాంటి ట్యాగ్ తగిలించుకున్నటువంటి వారికి అవకాశాలు రావడం చాలా గగనం అయితే ఇలాంటి డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ డైరెక్టర్ల పాలిట దేవుడుగా మారారు టాలీవుడ్ హీరో గోపీచంద్. ఈయన ఫ్లాప్ డైరెక్టర్ లందరికీ అవకాశాలు కల్పిస్తూ వారి అదృష్టాన్ని టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఆ డైరెక్టర్లు యధావిధిగా ఫ్లాప్ సినిమాలనే చవిచూస్తున్నారు.

ఇప్పటికే మారుతి శ్రీ వంటి డైరెక్టర్ల దర్శకత్వంలో ఈయన నటించిన పక్కా కమర్షియల్ రామబాణం వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి ఇలా ఈ సినిమాలో కమర్షియల్ గా చాలా నష్టాలను తీసుకువచ్చాయని చెప్పాలి ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి గోపిచంద్ తాజాగా మరో ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం కల్పించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు గోపీచంద్ ధైర్యం ఏంటి అంటూ కూడా ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.

శీను వైట్ల ఇండస్ట్రీలో హిట్ ఇచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా ఫ్లాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి దాదాపు కనుమరుగైనటువంటి శ్రీను వైట్లకు గోపీచంద్ పిలిచి మరి అవకాశం ఇచ్చారు. దీంతో అందరు షాక్ అయ్యారు ఇక గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ అనంతరం ఈయన మరొక ఫ్లాప్ డైరెక్టర్ కి కూడా అవకాశం కల్పించారని తెలుస్తోంది.

గతంలో గోపీచంద్ హీరోగా తెరికెక్కిన జిల్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి రాధాకృష్ణకు కూడా ఈయన మరొక అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. తాజాగా ఈయన ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీగా డిజాస్టర్ కావడంతో ఈయనకి కూడా గోపీచంద్ సినిమా అవకాశం కల్పించారని విషయం తెలియడంతో ఫ్లాప్ డైరెక్టర్ల పాలిట గోపీచంద్ దేవుడిగా మారారని అయితే ఈయనకు ఈ ఇద్దరు డైరెక్టర్లు అయిన ఒక హిట్ ఇస్తారా లేదా అన్న విషయంపై అందరూ కూడా ఆత్రుత కనబరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -