Guntur Kaaram Movie Review: సూపర్ స్టార్ మహేష్ మాస్ జాతర అదుర్స్.. కానీ?

Guntur Kaaram Movie Review

విడుదల తేదీ: 12 జనవరి 2024
నటీనటులు: మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

 

గుంటూరు కారం సినిమా ద్వారా మహేష్ బాబు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే..

 

కథ: వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌) త‌న భ‌ర్త స‌త్యం (జ‌య‌రామ్)తో గొడ‌వ ప‌డి వెళ్లిపోతుంది. విడాకులు తీసుకొంటుంది. అప్ప‌టికి త‌న‌కో కొడుకు. పేరు ర‌మ‌ణ (మ‌హేష్ బాబు). రెండో పెళ్లి చేసుకున్నటువంటి వసుంధర రాజకీయాలలో స్థిరపడుతుంది అయితే తన రాజకీయాలకు తన మొదటి పెళ్లి తన మొదటి కుమారుడు రమణ అడ్డుగా వస్తున్నారని అడ్డు తొలగించుకోవాలని వసుంధర తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) భావిస్తాడు. తనను అడ్డు తొలగించుకోవాలి అంటే తనకు తన తల్లి వసుంధరకు సంబంధం లేదని రమణ సంతకం చేస్తే చాలు అంటూ పాతిక సంవత్సరాలు తర్వాత గుంటూరులో ఉన్నటువంటి తనని హైదరాబాద్ కి పిలిపిస్తారు. మరి పాతిక సంవత్సరాల తర్వాత తల్లిని చూసిన రమణ సంతకం పెడతారా లేదా అన్నది ఈ సినిమా కథ

నటీనటుల నటన: మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలాగే తన నటనతో మహేష్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అని చెప్పాలి. ఇక రమ్యకృష్ణ ప్రకాష్ వంటి తదితరులు అందరు కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

 

విశ్లేషణ: మాటల మాతృత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసే నైపుణ్యం త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఉంది. ఇక గుంటూరు కారం కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం ఇంకాస్త మంచిగా ఉంటే బాగుండేది అనిపించింది.
మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా విందు భోజనం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో గత సినిమా పోలికలు చాలా ఉన్నాయి అంటూ త్రివిక్రమ్ పై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథలో పెద్దగా కంటెంట్ లేకపోయినా సంక్రాంతికి విడుదలైంది కనుక సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు నటన డాన్స్ పెర్ఫార్మెన్స్ అలాగే రమ్యకృష్ణ మహేష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్.

మైనస్ పాయింట్స్: త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం కథను సాగదీయడం, బిజీ ఏం పెద్దగా లేకపోవడం.

రైటింగ్: 2.75/5

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -