Hanuman – Guntur Kaaram: హనుమాన్ థియేటర్లు హౌస్ ఫుల్ గుంటూరు కారం అలా.. ఏమైందంటే?

Hanuman – Guntur Kaaram: చిన్న సినిమాగా తెరమీదకి వచ్చిన హనుమాన్ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దిగింది. అయితే మేము గుంటూరు కారం సినిమాకి పోటీగా కాదు ఆయనతో పాటుగా వస్తున్నాము అని చెప్తూనే ఉన్నారు హనుమాన్ టీం. అయితే హనుమాన్ థియేటర్ల విషయంలో చాలా సమస్యలని ఎదుర్కొని బరిలోకి దిగింది.. హనుమాన్ సినిమాకు ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగుపెట్టనివ్వలేదు దిల్ రాజు.

 

ఉన్న థియేటర్లన్నీ గుంటూరు కారం సినిమాకే కేటాయించాడు. శిరీష్ రెడ్డి అయితే హనుమాన్ గురించి మరీ దారుణంగా మాట్లాడాడు గుంటూరు కారం సినిమాతో ఆ సినిమాకి పోలిక ఏంటి కావాలంటే నా సామిరంగా సినిమాతో పోల్చుకోమను అంటూ హనుమన్ సినిమాని తక్కువ చేసి మాట్లాడాడు. అయితే ఇప్పుడు అదే సినిమా టాలీవుడ్ ని టాలెత్తుకునే లాగా చేసింది. ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ కు సలాం కొట్టే పరిస్థితి వచ్చింది.

ఇంత తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ సినీ మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు అయితే గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే సినిమాకు ముందు నుంచి హైప్ తీసుకొస్తూనే ఉన్నాడు నిర్మాత నాగ వంశీ. రాజమౌళి నెంబర్ల దగ్గరికి వెళ్తాం అని పదేపదే నొక్కి చెప్పాడు కానీ రెండో రోజే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. సంక్రాంతి కాబట్టి ఈ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే గుంటూరు కారం పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయేది. సినిమాలో చెప్పుకోవటానికి మహేష్ బాబు తప్పితే వేరే ఏమీ లేదు.

 

సినిమాకి బ్యాడ్ రివ్యూలు బాడ్ మౌత్ టాక్ వచ్చింది దాంతో జనాలు అసలు ఈ సినిమా వైపు చూడటమే మానేశారు ఈ విషయం బుక్ మై షో చూస్తే అర్థమవుతుంది. గుంటూరు కారం సినిమాకి డిమాండ్ లేదు కానీ తగినన్ని థియేటర్లో ఉన్నాయి. డిమాండు లేకపోయినా కూడా సినిమాని ఆడిస్తున్నారు. అయితే ఆంధ్రాలో మాత్రం డిమాండ్ ఉండే సినిమాను థియేటర్లో వేసుకుంటున్నారు. ఇక్కడ హనుమాన్ సినిమాకి 20% స్క్రీన్లు పెరిగాయని తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ గుంటూరు కారం కూర్చిని హనుమాన్ మడత పెట్టేసి పక్కన పెట్టేసిందని చెప్పాలి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -