Kumari Aunty: వివాదాలతో కుమారి ఆంటీకి సెలబ్రిటీ స్టేటస్.. ఆ షో ప్లస్ కానుందా?

Kumari Aunty: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫేమస్ అయినంతగా మరెవరు ఫేమస్ అవ్వలేదని చెప్పవచ్చు. ఏకంగా తెలంగాణ సీఎం కూడా ఆమె గురించి మాట్లాడారంటే ఆమెకి ఏ రేంజ్ లో పాపులారిటీ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్లకు పైగా ఈమె ఒక ఫుడ్ స్టాల్ ని నిర్వహిస్తున్నప్పటికీ రీసెంట్ గానే ఆమె ఫేమస్ అవ్వటం చెప్పుకోదగ్గ విషయం. అయితేఆమెకి వచ్చిన పాపులారిటీకి ఆమె స్టాల్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎంతగా అంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్ తో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

 

దాంతో ఆమె ఫుడ్ స్టాల్ ని పోలీసులు తొలగించడం దాన్ని మళ్ళీ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం వలన మరింత ఫేమస్ అయ్యింది కుమారి ఆంటీ. అయితే ఈమెని స్ఫూర్తిగా తీసుకొని పదిమంది గురించి ఈమెకి తెలియాలి అనుకున్న నెట్ఫిక్స్ వారు ఆమెపై ఒక డాక్యుమెంటరీని రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కుమారి ఆంటీ తాజాగా సోషల్ మీడియా నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా వారు నిర్వహించే బీబీ ఉత్సవంలో కుమారి ఆంటీ పాల్గొనబోతుంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు స్టార్ మా సీరియల్ ఆర్టిస్టులు పాల్గొన ఈ కార్యక్రమంలో కుమారి అంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు త్వరలోనే ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. అయితే కొంతమంది మీడియా వాళ్ళు మీకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది అంట నిజమేనా అంటే ఆమె అమాయకంగా అక్కడికి వెళ్లి వంట చేయాలా అని అడగడం పలువురిని ఆకర్షించింది.

 

ఆమెకి బిగ్ బాస్ మీద ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతుంది. అయితే సోషల్ మీడియా వలన వచ్చిన పాపులారిటీతో ఈమె ఎంత ఫేమస్ అవుతుందో అంత ఇబ్బంది కూడా పడుతుందనేది నాణానికి మరోవైపు ఉన్న నిజం. ఆమెని చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులందరూ తిట్టిపోస్తున్న సంగతి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -