Naga Chaitanya: కస్టడీతో నాగచైతన్యకు సక్సెస్ దక్కిందా.. మూవీ ఎలా ఉందంటే?

Naga Chaitanya: తెలుగు సినిమా ప్రేక్షకులకు అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి కాస్త బ్యాడ్ టైం నడుస్తోంది. చైతన్య నాగార్జున అఖిల్ లు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ గా నిలుస్తున్నారు. అవుతున్నాయి. నాగార్జున ది ఘోస్ట్‌, చైతు థ్యాంక్స్‌, ఇటు అమీర్‌ఖాన్‌తో క‌లిసి చేసిన లాల్‌సింగ్ చ‌ద్దా, తాజాగా వ‌చ్చిన అఖిల్ ఏజెంట్ ఇలా అన్ని సినిమాలు అన్నీ ఒక‌దానిని మించిన డిజాస్ట‌ర్ లుగా నిలుస్తున్నాయి. ఇకపోతే నాగచైతన్య తాజాగా నటించిన కస్టడీ సినిమా ఈనెల 12న విడుదల కానుంది.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ చిట్టూరి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాలి.. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టించ‌గా, శ‌త్‌కుమార్‌, సంప‌త్‌రాజ్‌, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు న‌టించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకున్న క‌స్ట‌డీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

 

క‌స్ట‌డీ ఫ‌స్ట్ కాపీ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌కు వేశార‌ట‌. సినిమా చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌గా స్పందించార‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ మొదలైంది. ఫ‌స్ట్ 20 నిమిషాలు చాలా కూల్‌గా, ఫ్ల‌జెంట్‌గా సాగుతుంద‌టని, తరువాత ప్రేక్ష‌కులు స్టార్టింగ్ నుంచే సినిమాలో లీన‌మ‌య్యేలా ఉంటుంద‌ట‌. ఇక అర‌వింద్ స్వామి ఎంట్రీతో సినిమా మ‌రో రేంజ్‌కు వెళ్లిపోతుంద‌ని నాగ‌చైత‌న్య త‌న పాత్ర‌లో అలా ఒదిగిపోయాడ‌ని చెపుతున్నారు. నాగ‌చైత‌న్య త‌ర్వాత అర‌వింద్ స్వామి పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుంద‌ని కృతిశెట్టి పాత్ర‌కు మంచి స్కోప్ ద‌క్కింద‌ని అంటున్నారు. ఇక చివ‌రి 40 నిమిషాల ఆట చూస్తుంటే గూస్‌బంప్స్ మోత మోగిపోయేలా ఉంటుంద‌ట‌. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -