Rana Daggubati: పెళ్లితో రానా జీవితం నాశనమా.. కోరి కష్టాలు తెచ్చుకున్నాడా?

Rana Daggubati: దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో హీరోగా లేదా విలన్ గా నటించడానికి కూడా రానా వెనకాడటం లేదు.అయితే రానా 2020వ సంవత్సరంలో మెహికా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక పెళ్లి తర్వాత రానా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో రానా నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో రానాకు పెళ్లి కలిసి రాలేదా పెళ్లి తర్వాత చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 

రానా కెరియర్ పరంగా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అని చెప్పాలి.రానా ఈ మధ్యకాలంలో సినిమాలో ఎంపిక విషయంలో కాస్త తడబడుతున్నారని అందుకే ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయని పలువురు భావిస్తున్నారు.బాహుబలి సినిమా తర్వాత రానా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయారు.

 

ఇక బాహుబలి సినిమా తర్వాత ఈయన నటించిన భీమ్లా నాయక్ సినిమా రానాకు మంచి పేరును తీసుకువచ్చింది. అనంతరం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా సాయి పల్లవి కలిసిన నటించిన విరాటపర్వం సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఇక వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈయన నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ తెలుగులో ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్న మనకు తెలిసిందే. ఇలా ఈయన చేసిన వరుస ప్రాజెక్ట్స్ అన్ని డిజాస్టర్ కావడంతో పెళ్లి తర్వాత రానాకి కలిసి రాలేదా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -