Venkatesh: ఈ దృశ్యం చూస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే.. వెంకీ, రానా కంటతడి పెడుతూ?

Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దగ్గుబాటి కుటుంబానికి చెందిన వారు ఎంతోమంది ఇండస్ట్రీలో హీరోలుగా నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల దగ్గుబాటి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో దగ్గుబాటి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందాడు. అయితే మోహన్ బాబు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ స్వగ్రామం కారంచేడులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహన్ బాబు ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించటంతో తుది శ్వాస విడిచాడు. మోహన్ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే దగ్గుబాటి కుటుంబ సభ్యులు కారంచేడుకి చేరుకున్నారు.

మంగళవారం బాబాయి మరణ వార్త తెలిసిన వెంటనే నిర్మాత సురేష్ బాబు కారంచేడుకి చేరుకోగా షూటింగ్ వల్ల అవుట్ డోర్ లో ఉన్న వెంకటేష్ బుధవారం కారం చేడుకి చేరుకొని బాబాయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఇక సురేష్ బాబు కుమారులు దగ్గుబాటి రానా, అభిరామ్ కూడా తమ తాత మరణ వార్త తెలిసిన వెంటనే కారంచేడుకి చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మోహన్ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే వెంకటేష్ హుటాహుటిన షూటింగ్ పనులు పోస్ట్ ఫోన్ చేసుకొని కారంచేడుకి చేరుకున్నాడు.

బాబాయి మృతదేహాన్ని చూసి వెంకటేష్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక వెంకటేష్, రానా, ఇతర కుటుంబ సభ్యులు మోహన్ బాబు పాడే మోసి దగ్గరుండి అంతక్రియలు నిర్వహించారు. మోహన్ బాబు అంత్యక్రియలలో దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు దగ్గుబాటి అభిమానులు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఇక మోహన్ బాబు చివరి చూపు కోసం అక్కినేని నాగచైతన్య కూడా హాజరయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -