Rana Daggubati: పిల్లల విషయంలో రానా తీసుకున్న నిర్ణయమిదే.. అసలేమైందంటే?

Rana Daggubati: దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో హీరో గాను విలన్ పాత్రలలోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా గురించి పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా 2020 వ సంవత్సరంలో మిహీకా బజాజ్ అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఇలా రానా దంపతుల వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ వీరి వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానా తన భార్య మిహీక విడాకులు తీసుకుని విడిపోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలను రానా భార్య కొట్టిపారేస్తున్నారు.

 

ఇక పిల్లల విషయంలో కూడా వీరి గురించి తరచు ఏదో ఒక వార్తలు వినపడుతూనే ఉంటాయి. రానా దంపతులకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతున్న పిల్లలు లేకపోవడంతో వీరి పిల్లల గురించి తరచూ ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.అయితే పిల్లల విషయంలో రానా దంపతులు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రానా మీహీకా పిల్లల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం దగ్గుబాటి కుటుంబ సభ్యులను షాకింగ్ కి గురిచేసింది.

 

రానా దంపతులు పిల్లలను కనకుండా, అనాధ పిల్లలను దత్తత తీసుకొని పెంచాలని నిర్ణయించుకున్నారట. ఇలా పిల్లలని కాకుండా అనాధలను దత్తత తీసుకోవాలని రానా దంపతులు నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయం తెలిసి కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎక్కడ అధికారకంగా ప్రకటించకపోయిన ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -