YS Jagan: జగన్ మోసం వల్ల వైసీపీకి ఇంత నష్టం జరిగిందా?

YS Jagan: తాజాగా ఏపీ సీఎం జగన్ గురించి ఆ పార్టీ క్యాడర్ పెదవి విరుస్తున్నారు. జగన్ రెడ్డి లక్షణం మోసం చేయడమే అని,ఒకరిని మోసం చేసి మరొకరికి మేలు చేస్తారని నమ్మడం అత్యాశే. నమ్మినందుకు చివరికి అత్యాశే మిగులుతుంది అని వైసీపీ క్యాడర్ ఖాండ్రిస్తోంది. అయితే ఇందుకు గల కారణం ఆయన మోసం చేసిన వారి జాబితాలో క్యాడర్ కూడా ఉన్నారు. మన ప్లేట్లో మన బిర్యానీ కథలు చెప్పి అధికారంలోకి రాగానే వారిని నిర్వీర్యం చేసి పడేశారు జగన్. వారికి ప్రత్యామ్నాయంగా వాలంటీర్లను తెచ్చారు. వారినే నాయకులుగా చేస్తామని అంన్నారు. దీంతో క్యాడర్ పరిస్థితి ఎటు కాకుండా దారుణంగా తయారయింది.

టార్గెట్ చేసుకుంది సొంత క్యాడర్ నే! అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులను ఎక్కడక్కకడ నిలిపివేసి టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టానని అనుకున్నారు. అయితే కోర్టుల కు వెళ్లి మరో రకమైన ప్రయత్నాలు చేసి వారి డబ్బులు వారు తెచ్చుకున్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చిందని ఆశపడి చిన్నా చితకా పనులు తీసుకుని చేసిన వైసీపీ క్యాడర్ కు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ నిధులు రావడం లేదు. చాలామంది వైసిపి నేతలు సొంతంగా ఖర్చు పెట్టుకుని అప్పుల పాలయ్యారు. కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ వాళ్లని వాళ్ల బిల్లులు ఆపేశారు సరే వైసీపీ క్యాడర్ ను ఎందుకు వేధిస్తున్నారంటే ప్రభుత్వం వద్ద ఎటువంటి స్పందన లేదు.

 

జగన్ తప్పకుండా బిల్లులు చెల్లిస్తానన్న హామీతో చాలామంది సొంత డబ్బుతో ఖర్చుపెట్టి మరీ కొన్ని పనులు చేయించినప్పటికి నిధులు మాత్రం రావడం లేదు. స్థాయి కార్యకర్తల్నే కాదు కదా సోషల్ మీడియా కార్యకర్తల్నీ పట్టించుకోలేదు. సొంత డబ్బుతో ఊరూరా ప్రచారం చేసి చివరికి అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే పట్టించుకునే దిక్కు లేక చనిపోయిన శ్యామ్ కలకడ అనే వ్యక్తి దగ్గర్నుంచి జగన్ అధికారంలోకి రావడానికి పని చేసిన కొన్ని వేల మంది అన్యాయానికి గురయ్యారు. కొంత మంది ఇతర పార్టీల మద్దతుదారులుగా మారిపోతే వారిపై గంజాయి కేసులు పెట్టారు. రేపు మా పరిస్థితి కూడా ఇదేనేమో అని చాలా మంది జగనన్నకు దండం పెట్టారు. వైసీపీ పెద్దల మాటలు విని కోర్టులపై దాడి చేస్తే కేసలు అయితే. ఒక్కరూ సాయం చేయలేదు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రభుత్వం మారితే వారూ కంటికి కనిపించరు. మొత్తంగా వైసీపీ సోషల్ మీడియా నిర్వీర్యానికి కారణం ఎంతసేపూ వాళ్లను వాడుకుందామనుకోవడమే కానీ ఏదో ఓ సాయం చేద్దామని అనుకోలేదు. బిల్లులిస్తే చాలంటున్న క్యాడర్,ప్రభుత్వాన్ని నమ్మి పని చేశామని.. బిల్లులుఇస్తే చాలని ఇక జగన్ జోలికి రాబోమని దండం పెట్టుకుంటున్నారు క్యాడర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -