YCP: వైసీపీ తీరు మారదా.. ఫేక్ సర్వేలతో ఇలాంటి ప్రచారం అవసరమా?

YCP: ఏపీలో త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఎన్నో మీడియా పత్రికలు సర్వేలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అన్ని పత్రికలలోనూ కూడా వైసీపీకే మెజారిటీ ఉండబోతుంది అంటూ సర్వేలు సూచించాయి కానీ తాజా ఇండియా టుడే సర్వేలతో అసలు విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలో నిబద్ధత కలిగిన ఇండియా టుడే రాష్ట్రంలో ఓట్ల షేరింగ్‌పై వెల్లడించిన సర్వే నివేదికతో వైసీపీ మైండ్‌ బ్లాంక్‌ అయింది. మొదట్నుంచి ఫేక్‌ ప్రచారాన్ని నమ్ముకున్న వైసీపీ వర్గాలు ప్రతిష్ఠాత్మకమైన ఈ సర్వే చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇండియా టుడే సర్వేను ప్రతి ఒక్కరు నమ్ముతారని వారికి అనుకూలంగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ వస్తోంది వైసిపి పార్టీ ఇండియా టుడే కంటే మరింత పాపులారిటీ టీవీ అయినటువంటి రిపబ్లిక్ టీవీ చేత సర్వే చేయించిందని, ఆ సర్వేలో వైఎస్ఆర్సిపి పార్టీకి 132 సీట్లు వస్తాయని ఈసారి కూడా అధికారంలో తామే ఉంటామంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేస్తుంది.

ఇలా రిపబ్లిక్ టీవీ సర్వే చేస్తుందన్న క్రమంలోనే వీరి ఫేక్ బండారం మొత్తం బయటపడింది. ఇండియా టుడే సర్వేలో టీడీపీకి 45 శాతం, టీడీపీ-జనసేన కలిస్తే 52 శాతం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 54 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఈ సర్వేని వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.

 

రిపబ్లిక్‌ టీవీ సర్వే అంటూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 41 సీట్లలో, ఇతరులు 2 సీట్లలో, వైసీపీ 132 సీట్లు గెలుచుకుంటాయని ఒక పోస్టర్‌ను తయారు చేసి రిపబ్లిక్ టీవీ ఆ టీవీకి మధ్య తేడా తెలియని పేటీఎం బ్యాచ్ ఈ సర్వేకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ టివిలోగో వేసి ప్రచారం చేయడంలోనే వీరి ఫేక్ బండారం మొత్తం బయటపడింది అంటూ పలువురు ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -