Sreeleela: తల్లిపై హీరోయిన్ శ్రీలీల చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Sreeleela: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతోపాటు యంగ్ హీరోలతో పాటుగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది శ్రీ లీల. యంగ్ హీరోల నుంచి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ గా శ్రీ లీల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా మదర్స్ డే సందర్భంగా స్టార్ మాలో ఒక ఈవెంట్ ని చేస్తున్నారు. ఈవెంట్ కి శ్రీ లీల ఆమె తల్లి ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల తన తల్లి గురించి చెబుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మా అమ్మకు చాలా ఓపిక ఎక్కువని, అమ్మగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో ఏ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలో అమ్మకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది శ్రీలీల. నా స్కూల్ డేస్ సమయంలో నేను బిజీగా ఉండేదాన్ని, నాకు అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కళ్లన్నీ నాపైనే ఉండటంతో అల్లరి చేసేదాన్ని కాదు అని నవ్వుతూ తెలిపింది శ్రీ లీల.

 

తిండి విషయంలో నేను చిన్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించానని, నా విషయాలను నేనే హ్యాండిల్ చేయగలనని తెలిసిన తర్వాత అమ్మ నా ఫ్రెండ్ లా మారిపోయింది అని శ్రీలీల చెప్పుకొచ్చింది. మా అమ్మ మల్టీటాస్కర్ అని ఖాళీగా ఉండటం అమ్మకు అస్సలు నచ్చదు అంటూ ఆమె కామెంట్లు చేసింది. మా అమ్మను నేను సూపర్ ఉమెన్ అంటాను. అమ్మ నాలెడ్జ్ సూపర్. మా అమ్మ నాలో భాగం. నా కెరీర్ లో సగ భాగం అని తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఇకపోతే శ్రీలీల కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు చాలామంది హీరోల సరసన నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -