Mass suicide case in Gujarat: ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య.. ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Mass suicide case in Gujarat: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి. అయితే కష్టం వచ్చిన ప్రతిసారి చనిపోవాలి అని ఆలోచన రావడం చాలా పెద్ద తప్పు. అయితే ఇలా చాలామంది క్షణికావేశంలో చాలా బాధలో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇలాంటి నిర్ణయాలు కారణంగా వారు చనిపోవడం కాకుండా బ్రతికున్న వారిని కూడా జీవితాంతం బాధ పెడుతూ ఉంటారు అయితే తాజాగా ఒకే కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకొని మరణించిన గుజరాత్ లోని సూరత్లో జరిగింది.

సూరత్ లోని మనీష్ సోలంకి ఫర్నిచర్ వ్యాపారం చేస్తారు అయితే ఆయన వద్ద సుమారు 35 మంది ఉద్యోగులు పరీక్షిస్తున్నారు. ఇక నిత్యం ఉద్యోగులు నిత్యం మనీష్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఆయనని కలిసేవారు. ఇలా మనీష్ ఒకరోజు ఉద్యోగులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి తలుపులు కొట్టిన మనిష్ ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఇంటి వెనకవైపు కిటికీ లోకి వెళ్లి చూడగా ఇంట్లో అందరూ కూడా నిర్జీవంగా పడిపోయి ఉన్నారు.

ఇలా అందరూ పడిపోయి ఉండడం చూసినటువంటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చి కిటికీ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్నటువంటి ఏడుగురు కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు మనీష్ తన భార్య ముగ్గురు సంతానంతో పాటు తన తల్లిదండ్రులు మొత్తం ఏడుగురు విషం తీసుకుని మరణించారు.

వీరిలో మనీష్ మినహా మిగిలిన వారంతా పురుగులు చనిపోగా మనీష్ మాత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వీరంతా కలిసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఆత్మహత్యకు గల కారణాలను కూడా లెటర్ రూపంలో రాసి ఉంచారు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ సూసైడ్ లెటర్ లో ఆర్థిక ఇబ్బందులు కారణంగానే చనిపోతున్నామని తెలియజేశారు అయితే వీరి చావుకు గల కారణాలు ఏంటి అనేది పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -