Sachin: తనయుడి సెంచరీ పై సచిన్ టెండూల్కర్ రియాక్షన్ చూసారా?

Sachin: ఇటీవల ప్రతీ క్రికెట్ అభిమాని చర్చిస్తున్న విషయం ఒకటే.. అదే అర్జున్ టెండూల్కర్ సెంచరీ. తాను ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు అర్జున్ టెండూల్కర్. దీనితో అందరూ తండ్రికి తగ్గ తనయుడు అని అర్జున్ ను కొనియాడుతున్నారు. చాలా మంది అభిమానులు, క్రికెట్ ప్రియులు ఈ విషయంపై స్పంచించారు. నెట్టింట్లో కూడా అర్జున్ సెంచరీ పై పెద్ద చర్చే జరిగింది. అయితే ఇటీవల ఈ విషయంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన స్పందన తెలియజేసాడు. సరిగ్గా 34 ఏళ్ల క్రిందట సచిన్ కూడా తన మొదటి రంజీ మ్యాచ్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే..

 

తానూ మొదటి రంజీలో సెంచరీ.
అభిమానులు క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ 34 సంవత్సరాల క్రితం తన మొదటి రంజీ మ్యాచ్ ఆడాడు. ఇక ఆ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సెంచరీ తో చెలరేగాడు. ఇటీవల అర్జున్ టెండూల్కర్ కూడా తన మొదటి రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో ఆ మ్యాచ్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. రంజీ లో గోవా టీమ్ వైపు ఆడిన అర్జున్ సెంచరీ బాదేశాడు. అయితే అర్జున్ టెండూల్కర్ ఆ మ్యాచ్ లో ఏడవ స్థానంలో వచ్చి మరీ సెంచరీ బాదడం విమర్శకులను సైతం ఔరా అనిపించింది.

 

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సచిన్ తన కొడుకు అర్జున్ కూడా సేమ్ తనలాగే మొదటి రంజీ మ్యాచ్ లో సెంచరీ కొట్టడంపై మొదటి సారి స్పందించాడు. ఇన్ఫోసిస్‌ ఎట్‌ 40లో మాట్లాడిన సచిన్.. “అర్జున్‌ తన సాధారణ బాల్యాన్ని గడపలేదు. చాలా రోజులుగా క్రికెట్‌ ఆడుతున్న ఓ ప్లేయర్‌ కొడుకుగా ఉండటం అతనికి అంత సులువు కాదు. అందుకే నేను రిటైరైన సమయంలో మీడియా నన్ను సన్మానించినప్పుడు ఒకటే కోరాను. అర్జున్‌ క్రికెట్‌ను ప్రేమించేలా ఓ అవకాశం ఇవ్వండి. అందుకు అతన్ని అనుమతించండి అని కోరాను” అని అన్నాడు.

 

అర్జున్ అద్భుత ప్రదర్శన చేస్తాడనే నమ్మకం నాకుంది, కానీ అతన్ని దయచేసి ఒత్తిడికి గురి చేయవద్దు. అతనికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అతని ప్రదర్శన చూసిన తర్వాత స్పందించవచ్చు, కానీ ముందే అతనిపై ఒత్తిడి పెంచవద్దని అన్నాడు. తన పేరెంట్స్ సచిన్ ని ఒత్తిడికి గురి చేయకుండా ఎలా ప్రోత్సహించారో.. తాను కూడా అర్జున్ ను అలాగే ప్రోత్సహిస్తాను అని ఈ సందర్బంగా సచిన్ అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -