Sachin Tendulkar: సచిన్ సంచలన వ్యాఖ్యలు.. అతడు లేకుంటే ప్రపంచకప్ వచ్చేది కాదు..!!

Sachin Tendulkar: టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. మళ్లీ ప్రపంచకప్ అందుకోవడానికి 28 ఏళ్ల పాటు నిరీక్షించింది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ రెండోసారి ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది. దీంతో దేశంలోని 130 కోట్ల మంది అభిమానుల గుండెలు ఉప్పొంగాయి. అంతేకాకుండా టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్‌ చిరకాల కోరిక కూడా నెరవేరింది. ముఖ్యంగా ప్రపంచకప్ విజయంలో యువరాజ్, ధోనీ, గంభీర్ ప్రముఖ పాత్ర వహించారు.

 

అయితే ఈరోజు యువరాజ్ సింగ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ విజయం గురించి సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆనాడు యువరాజ్ జట్టులో లేకపోతే తాము ప్రపంచకప్ గెలిచేవాళ్లం కాదని సచిన్ అభిప్రాయపడ్డాడు. తాను టన్నుల కొద్దీ పరుగులు చేసినా ప్రపంచకప్ గెలవాలనే తన కోరిక మాత్రం యువరాజ్ ద్వారా నెరవేరిందని ప్రశంసలు కురిపించాడు. ఆల్‌రౌండర్‌గా యువరాజ్ రాణించడంతోనే టీమిండియా ప్రయాణం సాఫీగా సాగిందని సచిన్ అభిప్రాయపడ్డాడు.

 

2011 ప్రపంచకప్‌లో యువరాజ్ ఎలా ఆడాడో ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆ మెగా టోర్నీలో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు యువీ వెన్నుముకలా వ్యవహరించాడు. గ్రూప్‌ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. దీంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను కోహ్లీతో కలిసి యువరాజ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో గ్రౌండ్‌లోనే యువీ నోట్లో నుంచి రక్తం కక్కుకోవడంతో అభిమానులు కంగారుపడ్డారు. అతడికి క్యాన్సర్ ఉందని అప్పటివరకు అభిమానులకు తెలియదు. కానీ వరల్డ్ కప్ గెలవాలనే కసి, అంకితం ముందు క్యాన్సర్ అతడిని ఏమీ చేయలేకపోయింది.

 

మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువరాజ్
2011 ప్రపంచకప్‌లో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడంటే అతడి ప్రదర్శన ఏ లెవల్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను అతడు ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లో గంభీర్‌, ధోని మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. యువీ సైతం ధోనితో పాటు లాంఛనాన్ని పూర్తి చేసి టీమిండియాకు కప్ అందించాడు. తన అభిమాన క్రికెటర్ సచిన్‌ను భుజాలపై మోస్తూ కోట్లాది మంది భారతీయులకు యువీ ఆనందాన్ని పంచాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -