CM KCR-HD Kumaraswamy: కుమారస్వామి, కేసీఆర్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయించారంటే?

CM KCR-HD Kumaraswamy: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. మొన్నటివరకు బీజేపీపై విమర్శల దాడికే పరిమితమైన గులాబీ బాస్.. ఇప్పుడు మరిత స్పీడ్ పెంచారు. గత కొంతకాలంగా పెండింగ్ ఉన్న జాతీయ పార్టీ ప్రయత్నాలను ప్రయత్నాలను వేగవంతం చేశారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రగతిభవన్ నుంచి మీడియాకు లీకులిచ్చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా టీఆర్ఎస్‌ కమిటీలన్నీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని, కొత్త పార్టీ పెట్టి బంగారు భారత్ దిశగా ప్రయత్నాలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. దీంతో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అధికారికంగా ప్రకటించడం మాత్రమే ఇక మిగిలి ఉంది.

దసరా రోజున సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారనే ప్రచారం తెలంగాణ పొలిటికల్, టీఆర్ఎస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ పూర్తిగా జతీయ రాజకీయాలకు పరిమితం అవుతారని, వచ్చే ఎన్నికల్లో మోదీని ఎదుర్కొవడంపైనే దృష్టి పెడతారని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా తిరిగి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముందుగా బహిరంగ సభలు నిర్వహిస్తారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీయేత సీఎంలను కలిసి మద్దతు కోరారు. త్వరలోనే మరికొంతమంది నేతలను కలిసే అవకాశముందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి చెక్ పెట్టేలా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ మోడల్ భారతదేశానికి కావాలని చెబుతున్న తెలంగాణ సీఎం.. రైతు సమస్యలు, రైతు సంక్షేమం అంశాలను లక్ష్యంగా చేసుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళతారని తెలుస్తోంది. కేసీఆర్ ఏ బహిరంగ సభ లేదా ప్రెస్ మీట్ లో చూసినా రైతులకు తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు, రైతలు పట్ల కేంద్రం చూపుతున్న విపక్ష గురించే మాట్లాడుతున్నారు. దీనిని బట్టి చూస్తే రైతు సమస్యల లక్ష్యంగానే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ఉంటాయనే చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి అనేది అసాధ్యం. అందుకనే కాంగ్రెస్ ను కలుపుకుని కేసీఆర్ వెళతారనేది టాక్ కూడా నడుస్తోంది.

అయితే జాతీయ పార్టీ ప్రకటించనున్నారనే వార్తల నేపథ్యంలో ఆదివారం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా హైదరాబాద్ రావాల్సిందిగా కుమారస్వామిని కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ పిలుపుతో కుమారస్వామి హైదరాబాద్ వచ్చి ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిశారు. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలతో పాటు కొత్త పార్టీపై ఇరువురు చర్చించుకున్నారు.

కేంద్రంలో మోదీని ఎదుర్కొవడం గురించి చర్చించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి అవసరమని, కాంగ్రెస్ ప్రస్తుతం చతికిలపడిపోయిందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలతోకలిసి ప్రత్యామ్నాయ కూటమి అవసరముందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని కుమారస్వామి ఆహ్వానించారు. తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాము జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

కేసీఆర్, కుమారస్వామి భేటీలో తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి కూడా చర్చ జ రిగింది. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి కుమారస్వామి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, కర్ణాటకలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈతరుణంలో బీజేపీని ఎదుర్కొవడంపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -