Success Story: ఒకప్పుడు ఆఫీస్ బాయ్.. ఇప్పుడు రెండు కంపెనీలకు సీఈవో.. ఇతని సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

Success Story: జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో మనకు ఎన్నో ఒడిదుడుకలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటిని చేదించి లక్ష్యం వైపు అడుగులు వేయటమే ముఖ్యం ఇలా ఎంతోమంది ఉన్నత లక్ష్యాలను చేరుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇలా ఎందరికోస్ఫూర్తిగా నిలిచినటువంటి వారిలో మహారాష్ట్ర బీడ్ కి చెందిన దాదాసాహెబ్ భగత్ అనే వ్యక్తి ఒకరు.

1994 లో జన్మించడం భగత్ ఉన్నత పాఠశాల చదువులను పూర్తి చేసి అనంతరం పూనే వచ్చి ఐటిఐ డిప్లమా కోర్స్ పూర్తి చేశారు.ఆ తర్వాత ఖర్చులకోసం ఈయన రూమ్ సర్వీస్ చేరారు నెలకు 9000 రూపాయల జీతం అందుకుంటు తన జీవనం గడిపేవారు అయితే ఈయన అక్కడ ఉద్యోగం మానేసి ఇన్ఫోసిస్ కంపెనీలో చేరారు అక్కడ గెస్ట్ హౌస్ లో వచ్చే అతిధులకు ఈయన మర్యాదలు చేస్తూ ఉండేవారు.

 

ఈ విధంగా ఇన్ఫోసిస్ లో చేరడంతో సాఫ్ట్వేర్ రంగంపై ఈయనకి ఆసక్తి కలిగింది. దీంతో పగలంతా కూడా చదువుకుంటూ రాత్రి ఉద్యోగం చేసేవారు. ఈ విధంగా యానిమేషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తూ మరోవైపు ఇన్ఫోసిస్ లో నైట్ ఉద్యోగం చేసేవారు ఇలా ఈ కోర్స్ పూర్తి కాగానే భగత్ ముంబైలో ఉద్యోగం సంపాదించి కొంతకాలం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాదులో డిజైనింగ్ అండ్ గ్రాఫిక్స్ సమస్త లో ఉద్యోగం చేస్తూనే C++ జావా వంటి కోర్సులను చేశారు.

 

ఇలా పలు కోర్సులను చేసిన అనంతరం ఈయన ఏకంగా రెండు కంపెనీలను సొంతంగా నిర్వహిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇక కరోనా సమయంలో తన సొంత గ్రామంలో ఒక పశువుల కొట్టంలో ఈయన కొందరు గ్రామస్తులకు ఈ కోర్స్ పట్ల శిక్షణ ఇప్పించిన భగత్ అనంతరం తన గ్రామంలోని కరోనా సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా తన కార్యకలాపాలను కొనసాగించారు. ఇలా ఒకప్పుడు రూమ్ బాయ్ గా సర్వీసెస్ అందిస్తున్నటువంటి భగత్ ఇప్పుడు ఏకంగా రెండు కంపెనీలకు అధిపతిగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -