Success Story: భర్త ఆటో డ్రైవర్.. భార్య పీహెచ్డీ.. ఇలాంటి భర్త ఉన్న ప్రతి మహిళ అదృష్టవంతురాలే అంటూ?

Success Story: “ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్” అనే మాట ఇలాంటి ఆడవాళ్ళని చూసి అన్నారేమో అనిపిస్తుంది. ఒకవైపు సంసారం ఎత్తి పెడుతూ, మరొకవైపు భర్త పిల్లల బాగోగులు చూసుకుంటూ పీహెచ్డీ సాధించిన ఒక ఇల్లాలు సాధించిన విజయం ఇది. ఇంతకీ ఏం జరిగిందంటే చదువుకోవాలనుకొని పరిస్థితులకి తలొగ్గి పెళ్లి చేసుకున్న ఒక ఆడపిల్లని అర్థం చేసుకొని సహృదయంతో చదివించాడు ఒక భర్త. ఆమె కూడా బాధ్యతగా చదువుకొని 2023 జూలై 4న పీ హెచ్ డి అందుకుంది. ఆమె ఈపూరి షీలా.

ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా, తెనాలి మండలం, పెదరావూరు గ్రామానికి చెందిన మహిళ. ఈమె తల్లి బాల్యంలోనే మరణించారు. గ్రామంలోనే పదో తరగతి వరకు చదువుకుంది. తర్వాత తెనాలిలో ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత డిగ్రీ చదువుతుండగానే 2003లో ఆటో డ్రైవర్ రావూరి కరుణాకర్ తో వివాహం అయింది. అయితే భార్యకి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించిన కరుణాకర్ భార్య డిగ్రీ పూర్తి చేసేలాగా ప్రోత్సహించాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి.

 

దాంతో ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలవడం కోసం 2004లో అక్షర దీప్తి పథకంలో ప్రేరక్ గా చేరింది. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్ శిక్షణలో చేరి పి జి డి సి ఏ ని పూర్తి చేసింది. తర్వాత ఉద్యోగం కోసం అప్లై చేస్తే డిగ్రీ లేకపోవటంతో ఉద్యోగం రాలేదు. ఆఖరికి 2009లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసింది షీలా. ఆ తర్వాత ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కి దరఖాస్తు చేయగా పీహెచ్డీ అవసరం అని చెప్పటంతో తాను పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలుగా పనిచేసింది.

 

షీలా 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్డీకి నోటిఫికేషన్ రావడంతో భర్త ప్రోత్సాహంతో దానికి దరఖాస్తు చేసుకుంది. డాక్టర్ ఎన్. రత్న కిషోర్ గైడ్ గా ఫుల్ టైం రీసెర్చ్ స్కాలర్గా చేరింది. మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలవడంతో కొంతకాలం గ్యాప్ వచ్చింది. అదృష్టవశాత్తు 2016లో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కి ఎంపిక అవ్వటంతో ఆమె కష్టాలు తీరినట్లు అయింది. మొత్తానికి సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ సెక్టార్ అనే అంశంపై ధీసెస్ సమర్పించి, 2023 జూలై 4న పి హెచ్ డి పట్టా అందుకుంది షీలా. నేను సాధించిన ఈ ఘనత కేవలం నా భర్త వల్లే అంటుంది షీలా. గవర్నమెంట్ లెక్చరర్ కావాలన్నా తన ఆశయాన్ని కూడా బయటపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -