Success Story: నాన్న హమాలి తల్లి పాచిపని.. ఈ ఖమ్మం యువతి సక్సెస్ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Success Story: జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అంత గొప్ప స్థానంలో ఉన్నారు అంటే వారు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎవరు పూలబాట వేసి ఉండరు.ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొని అలాంటి ఉన్నత స్థానంలో ఉంటారు. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పాలి అలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారు ఖమ్మం జిల్లాకు చెందిన మనీషా అనే యువతి.

ఖమ్మం జిల్లాకు చెందిన మనీషా అనే యువతీ తండ్రి హమాలీగా పనిచేస్తారు. తన తల్లి కుటుంబ పోషణ కోసం కొన్ని కుటుంబాలలో పాచి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.నిరుపేద కుటుంబంలో జన్మించిన మనీషా సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఒకే గదిలోనే అద్దెకు ఉండేవారు అయితే తల్లిదండ్రుల కష్టాన్ని కల్లారా చూసినటువంటి ఈమె తన తల్లితండ్రుల కష్టాన్ని తీర్చాలని భావించి చదువుపై దృష్టి పెట్టింది.

 

ఇలా పదవ తరగతి వరకు ఖమ్మంలో చదివినటువంటి ఈమె అనంతరం తన చదువుని వరంగల్లో పూర్తి చేశారు.ఇలా చదువు పూర్తిగా గాగానే చాలామంది తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు కానీ తన జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంలోనే ఈమె ప్రభుత్వ ఉద్యోగంపై దృష్టి పెట్టారు అదే సమయంలోనే భద్రాద్రిజోన్ లో సివిల్ ఎస్సై 50 పోస్టులు ఖాళీగా ఉండడంతో నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఇంత తక్కువ పోస్టులు ఉన్న ఈ నోటిఫికేషన్ లో తనకు జాబ్ వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో ఈమె ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు అయితే శిక్షణ తీసుకుంటూ వారాంతపు పరీక్షలు గ్రాండ్ టెస్ట్ లు రాస్తూ తనకు తాను మంచి శిక్షణ తీసుకున్నారు.రాత్రి పగలు కష్టపడి చదువుతూ 50 పోస్టులలో ఓపెన్ క్యాటగిరిలో తనకు జాబ్ రావడం నిజంగా సంతోషంగా అనిపించింది అంటూ మనీషా తన సక్సెస్ స్టోరీని తెలియజేశారు. ఇలా ఎన్నో కష్టాలను ఒడిదుడుకులని ఎదుర్కొని ఉన్నత స్థానంలో నిలిచిన మనీషా ఎందరికో స్ఫూర్తి అని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -