Beer Benefits: రోజూ బీర్‌ తాగితే ఆరోగ్యానికి మంచిదట.. ఇవి పాటించాలి మరి!

Beer Benefits: మద్యం ఆరోగ్యానికి హానికరం అంటుంటారు. మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను రోడ్డున పడేస్తున్నారు. కానీ.. మద్యన్ని ఓ లిమిట్‌తో తాగితే ఆరోగ్యానికి మంచిదందటున్నారు. ఒక మోతాదులో ప్రతి రోజు బీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి వచ్చింది.  అయితే ఆరోగ్యం బాగుంటుందని ఇష్టానుసారంగా తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు కూడా.

ప్రతి రోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆసక్తికరమైన పోర్చుగల్‌లోని నోవా యూనివర్సిటీ, లిస్బన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. రోజూ రాత్రి భోజనంతో పాటు బీర్‌ తాగడం వల్ల పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్‌ మరియు నాన్‌–ఆల్కహాలిక్‌ బీర్‌ రెండింటి నుండి వస్తుందట. మొత్తం 19 మంది 35 సంవత్సరాల వయసున్న పురుషులపై ఈ అధ్యయనాన్ని కొనసాగించారు. వారందరూ 4 వారాల పాటు ప్రతిరోజూ రాత్రి భోజనంతో పాటు 325 మిల్లీ లీటర్ల బీర్‌ తాగాలని కోరారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరికి ఆల్కహాల్‌ మరియు మరికొందరికి ఆల్కహాల్‌ లేని బీర్‌ ఇచ్చారు. ఆల్కహాలిక్‌ బీర్‌ లో ఆల్కహాల్‌ కంటెంట్‌ 5.2%గా ఉంది. ఇలాంటి బీర్‌ కొందరికి ఇచ్చి.. మరి కొందరికి నాన్‌ ఆల్కహాలిక్‌ బీర్‌ ఇచ్చారు.

నాలుగు వారాల పాటు చేసిన అధ్యయనం తర్వాత  ఈ పురుషుల మలం మరియు రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ నమూనాల ఆధారంగా బీర్‌ తాగడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఈ పరిశోధన ఫలితాలు బీర్‌ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ బ్యాక్టీరియా మరింత వైవిధ్యమైంది. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించారు. బీర్‌లో పాలీఫెనాల్స్‌ అనే సమ్మేళనాలు మరియు కుళ్లిన ప్రక్రియ తర్వాత ఏర్పడిన సూక్ష్మజీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన ద్వారా గుర్తించారు. ఇవి పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని నిర్ధారించారు. శరీరంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -