Health Tips: మొటిమలు, ముడతలు పోవాలంటే వీటిని అందులో నానబెట్టి తినండి!

Health Tips: మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. పౌష్టికాహారం తీసుకోవడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అందుకే వైద్యులు కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాలని సూచిస్తుంటారు అందులో స్ప్రౌట్స్‌ (మొతకెత్తిన విత్తనాలు) చాలా ముఖ్యమైనవి. ఇలాంటి తింటే తొందరగా రోగ నిరోధక శక్తి పెరుగుందంటున్నారు. పప్పు దినుసుల్లో చాలా విటమిన్లు ఉంటాయి. ఇలాంటి మార్కెట్లలోనూ దొరుగుతుంటాయి. శనగలు, పెసర్లు, ఇతరాత్ర పప్పు దినుసులను నీళ్లలో నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటే శారీరక దృఢంతో పాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు దరిచేరవు.

 

శరీరానికి మరింత పోషకాలు అందించాలంటే పెసర, సోయాబీన్స్, మోర్లలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి మినరస్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడంతో విటమిన్స్, మినరల్స్‌ లోపం పూర్తవుతుంది. పోషక విలువలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అప్పుడప్పుడు వచ్చే రోగాలతో పోరాటే శక్తి వీటికి ఉంటుంది. నానబెట్టిన మొలకలు తింటే శరీరంలో ఇమ్యూనిటీ కచ్చితంగా పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పదార్థలు తీసుకుంటే రోగాలతో పోరాడే శక్తితో పాటు వాతావరణం మారిన ప్రతిసారీ ఆరోగ్యం పాడవదు. అంతేకాక శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్లు చేరవు.

సోయాబీన్, పెసరలు నీటిలో నానబెట్టి తింటే ముఖంపై పింపుల్స్, ముడతలు ఉంటే అవి తగ్గిపోతాయి. నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని మెరుగుపరుస్తాయి.
సోయాబీన్, పెసరలో విటమిన్స్, మినరల్స్‌ తగిన మోతాదులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం కూడా లభిస్తుంది. రోజు వీటి తింటే కండరాలు పటిష్టంగా మారడంతో పాటు ఆ నొప్పులు దూరమవుతాయి. ఈ పప్పు దినుసుల్లో ఉండే పొటాషియం, ఫైలర్‌ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాక మలబద్ధకం, అలసట తదితర సమస్యలుంటే తొలగిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -