Health Tips: నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

Health Tips: పాత కాలంలో కింద కూర్చోని అన్నం తినేవాళ్లు. ఫ్యామిలీ అంతా కింద కూర్చోని కలిసి భోజనం చేసేవాళ్లు. బంధువుల ఇంటికి వెళ్లినా కింద కూర్చోనే తినేవాళ్లు. ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు వచ్చేశాయి. డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం లేదా టీవీ చూస్తూ సోఫాలో కూర్చోని తినడం లేదా బెడ్ మీద కూర్చోని కూడా చాలామంది తింటున్నారు. కింద నేల మీద కూర్చోని ఇప్పుడూ ఎవరూ దాదాపు తినడం లేదు. ఆ కాలం ఎప్పుడో పోయిందని చెప్పుకొవచ్చు.

అయితే కింద కూర్చోని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కింద కూర్చోని తినడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఇరుకుగా అంత సౌకర్యంగా అనిపించదు. కానీ కింద చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక నేల మీద కూర్చోని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కింద కూర్చోని తినేటప్పుడు ముందుకు వంగి తిరిగి మళ్లీ అసలు భంగిమకు వస్తామని, దీని వల్ల ఆహారం సలభంగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు.

అలాగే నేల మీద కూర్చోని తినడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కింద కూర్చోని తినే సమయంలో నాడి వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, దీని వల్ల సరిపడ ఆహారం శరీరానికి అందుతుందని చెబుతున్నారు.

అలాగే నేలపై కూర్చోని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. శరీరంలో ఆక్సిజన్ సర్క్యులేషన్ పెరుగుతుంని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కింద కూర్చుని తినడం వల్ల ఎక్కువ కాలం బ్రతుకుతామని, ఫిట్ నెస్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఏ సపోర్ట్ లేకుండా కింద కూర్చోని పైకి లేవగలినే వ్యక్తులు ఎక్కువకాలం బ్రతుకుతారని, నేలపై కూర్చోని తినేవారికి ఇలాంటి శక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: జగన్ పై దాడి చేసిన వస్తువు కూడా దొరకలేదా.. సాక్ష్యాలు మాయమయ్యాయా? మాయం చేశారా?

CM YS Jagan: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి....
- Advertisement -
- Advertisement -