Health Tips: చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా.. ఎందుకంటే?

Health Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. చలికాలంలో ఎక్కువగా డయోరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలంలో చాలామంది ప్రజలకు ఎక్కువగా దగ్గు, జలుబు వంటి సాధారణమైన చిన్న చిన్న రోగాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలామందికి గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

 

ఇలా జరుగుతుందనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీనికి చాలా కారణాలను వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలైనప్పటి నుంచి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది.

 

ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయినప్పుడు గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అలాగే రక్తపోటు ఎక్కువగా హెచ్చుతగ్గులు అయినా, గుండె వేగం పెరిగిన, శరీరం చల్లబడిన గుండెపోటు కు దారితీస్తుంది. అందుకోసమే ఎక్కువగా చల్లని ప్రదేశాలలో తిరగడం మంచిది కాదు. శరీరాన్ని చలికాలంలో ఎక్కువగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

 

దీనివల్ల శ్వాసకోశ ఇబ్బందులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వయసులో పెద్దవారు, గుండె సమస్యలు ఉన్న వారు కూడా మంచులో తిరగకపోవడమే మంచిది. ఇలాంటివారు చల్లని వాతావరణంలో ఉండకపోవడమే మంచిది. ఈ చలికాలంలో చల్లని నీరు అధికంగా తాగడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.

 

చలికాలంలో శరీరానికి చెమట బయటకు రాదు. కాబట్టి కొన్ని ద్రవాలు ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతాయి. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే చలికాలంలో చాలామందిలో విటమిన్-డి లోపిస్తుంది. దీనికి గల కారణం చలి ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు ఇంట్లో నుండి బయటకి రాకుండా ఉండకపోవడమే.

 

అందువల్ల విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం గుండెపోటు రాకుండా విటమిన్ డి అడ్డుకుంటుంది. చలికాలంలో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. చలికాలంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అంత మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే చలికాలం ఉదయం పూట ఒక 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం మంచిది. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు వైద్యులు చెప్పిన దాని ప్రకారం మందులు వాడడం కూడా వారి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -