Mahesh: సూపర్ స్టార్ మహేష్ మాటలు వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే!

Mahesh: అతనో స్టార్ హీరో.. తెలుగు చలన చిత్ర చరిత్రలో అతనికి ఎందరో అభిమానులు.. ఎన్నో సూపర్ హిట్లు. కానీ ప్రస్తుతం ఆ స్టార్ హీరో సముద్రమంత దుఃఖంలో మునిగిపోయాడు. అతనెవరో ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సూపర్ స్టార్ మహేష్. అవును.. ఒక్క సంవత్సరంలోనే కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన విపరీత బాధ ఇప్పుడు మహేష్ అనుభవిస్తున్నాడు. ఇక శోకసంద్రంలో మునిగిన మహేష్ బాబు బాధ వర్ణనాతీతం.

ఒక్క ఏడాదిలోనే..

ఎవరి జీవితంలోనైనా కుటుంబంలో ఒక్కరిని కోల్పోతేనే ఆ బాధ మాములుగా ఉండదు. అలాంటిది మహేష్ చాలా తక్కువ సమయం గ్యాప్ లో కుటుంబంలో అన్న, అమ్మలను, ఇక ఇటీవల నాన్నను కోల్పోయాడు. ఇక ప్రస్తుతం మహేష్ పరిస్థితిని చూసి అటు అభిమానులు. ఇటు టాలీవుడ్ జాలి పడుతుంది. అంతేకాకుండా మహేష్ ని ఓదార్చడం కోసం పలువురు మహేష్ కి ఈ సమయంలో సపోర్ట్ గా నిలుస్తున్నారు.

తండ్రి అంత్యక్రియల్లో భాగంగా మహేష్ గుండెలవిసేలా రోదించాడు. ఇక మహేష్ ని ఈ పరిస్థిని చూస్తూ అందరు కన్నీళ్లు కారుస్తున్నారు. పెద్దలు, ప్రముఖులు, సన్నిహితులు, కావాల్సిన వారు ఎంత మంది ఓదార్చిన మహేష్ కన్నీటిని ఆపలేకపోవడం అక్కడి వీడియోస్ చూస్తే అర్ధం అవుతుంది. తాజాగా మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ని అలా ఎప్పుడు చూడలేదంటూ ఫాన్స్, తెలుగు జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

చివరి క్షణాల్లో తండ్రి ముఖాన్ని చూస్తూ.. మహేష్ రోదిస్తూ వెలవెలబోయాడు. ఈ ఫోటో అందరి హృదయాలను కలచి వేస్తుంది. నాన్న ఒక్కసారి మాట్లాడు అంటూ.. కృష్ణ ముఖాన్ని చూస్తూ.. చెవిలో ఎదో చెప్తున్నట్లు ఈ ఫొటోలో కన్పిస్తుంది. ఆయన భౌతికకాయం నుదుటిపై మహేష్ ముద్దు పెడుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్టుగా తెలుస్తుంది. ఎంత భారాన్ని మోస్తున్నావు మహేష్ అంటూ అభిమానులు వేదనకు గురి అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -