Manchu Vishnu: మంచు విష్ణు 10 పుష్‌అప్‌లు చేస్తే దున్నపోతులా అవుతాడట.. నిజమేమిటంటే?

Manchu Vishnu: చాలా మంది సినీ నటులు సోషల్‌ మీడియాలో అలర్ట్‌గా ఉంటారు. తమకు నచ్చినవి.. నచ్చనివి ఫొటోలు, ప్రాంతాలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. ఈ క్రమంలో మా టాలీవుడ్‌ యంగ్‌ హీరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో చురకలంటిస్తున్నారు.

కలెక్షన్‌ కింగ్‌ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విష్ణు మొదట వరుస హిట్లతో దూసుకొచ్చాడు. సూర్యం, ఢీ తదితర తదితర సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని హిట్లు మరికొన్ని ప్లాప్‌లు తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు. గతంలో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించి మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు తాజాగా ‘జిన్నా’ మూవీ ద్వారా మరోసారి అభిమానులను అలరించడానికి మంచు విష్ణు సం సిద్ధమవుతున్నాడు. తాజాగా మంచు విష్ణు ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘ నేను పది పుష్‌ అప్లు చేసిన తర్వాత నేను ఇలా ఉంటానని ఊహించుకుంటాను‘ అనే క్యాప్షన్‌తో దున్నపోతు ఫొటోను షేర్‌ చేశాడు. అయితే ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు విసురుతున్నారు.
.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -