Hyderabad: హైదరాబాదులో అమావాస్య రోజు బాలుడిని బలిచ్చిన హిజ్రా?

Hyderabad: టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మూఢనమ్మకాలు వీడలేదు. ఈ మూఢనమ్మకాల వల్ల ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా ఈ మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్న కూడా మూఢనమ్మకాలను మాత్రం విడిచి పెట్టడం లేదు. మరి ముఖ్యంగా మారుమూల పల్లెటూళ్లలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన కూడా సమాజంలో మూఢనమ్మకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఇటీవల కాలంలో నరబలి ఘటనలు కలకలం రేపుతున్నాయి.

క్షుద్ర పూజలు చేయడం చేతబడులు చేయడం నరబలి ఇవ్వడం అన్నవి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా కూడా బాలుడి ని నరబలి ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో బాలుడ్ని నరబలి ఇచ్చిన ఘటన కలకలం సృష్టించింది. అల్లాదున్ కోటి ఏరియాలో 8 ఏళ్ల అబ్దుల్ వాహీద్ అనే బాలుడిని అమావాస్య రోజున నరబలి ఇచ్చారు. ఆ బాలుడిని ఒక హిజ్రా బలి ఇచ్చిందని స్థానికులు ఆరోపిస్తూ హిజ్రా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. హిజ్రా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

 

కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల ఆరోపణల మేరకు హిజ్రాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నరబలి ఎందుకు ఇచ్చారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు. తాజాగా అమావాస్య రోజున బాలుడ్ని బలి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడి మృతదేహాన్ని సమీపంలోని నాలాలో గుర్తించిన స్థానికులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా క్షుద్రపూజలు నిర్వహించిన తర్వాత బాలుడ్ని నరబలి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. ఒక్కరు చేసిన పని కాదని, హిజ్రాకు ఎవరో సహాయం చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -