KCR-Himanshu: హిమాన్షు చేసిన పని వల్ల కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవా?

KCR-Himanshu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు గొప్ప మనసును చాటుకున్నారు.హిమాన్షు తాను చదువుతున్నటువంటి పాఠశాలలో ఫండ్స్ సేకరించి అలాగే తాను కూడా కొంత డబ్బును పోగు చేసి తెలంగాణలోని ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంతో అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ విధంగా హిమాన్షు ఈ స్కూలును తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలను మరమ్మత్తు చేయించి విద్యార్థులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో హిమాన్షు మంచి మనసుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడే కెసిఆర్ కు పెద్ద సమస్య వచ్చిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో భాగంగా హిమాన్షు మాట్లాడుతూ తనకు ఈ పాఠశాల దుస్థితి చూసే కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో క్లిప్ ను ఇతర పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా తెలంగాణలో కెసిఆర్ సర్కార్ వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇదే దుస్థితి ఏర్పడిందని పలువురు తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు పాఠశాలలను దత్తత తీసుకున్నమని చెప్పినప్పటికీ ఎలాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయలేదని ఇతర పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

ఈ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని సాక్షాత్తు ముఖ్యమంత్రి మనవడు ఇలా బయట పెట్టడంతో ఇది కాస్త కేసిఆర్ ను కాస్త చిక్కులలో పడేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలువురు ఈ వీడియో పై స్పందిస్తూ గొప్ప పని చేస్తూ హిమాన్షు స్వయంగా తన తాత పరువు తీశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ మేలుకొని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -