Holy Basil: ఆ రెండు తులసి మొక్కల్లో ఏ మొక్కను ఇంట్లో నాటుకోవాలో తెలుసా?

Holy Basil: భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను పవిత్ర మైనదిగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను పూర్వకాలం నుంచే ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాదని అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తులసి మొక్క విషయంలో కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. తులసి మొక్కలు రెండు రకాలు అయితే అందులో ఒకటి కృష్ణ తులసి మరొకటి రామ తులసి.

 

ఈ రెండు రకాల తులసి మొక్కలలో ఏ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిదో తెలియక చాలామంది తికమక పడుతూ ఉంటారు. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రంలో రామ తులసి, కృష్ణ తులసి రెండింటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండూ తులసి మొక్కలు గొప్పవేనని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ రెండు రకాల మొక్కలలో ఏ మొక్కనైనా కూడా మీ ఇంట్లో నాటవచ్చు. దేనికైనా పూజలు చేయవచ్చు. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉండటంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. కార్తీక మాసంలో ఏదైనా గురువారం రోజు ఇంట్లో రామ లేదా శ్యామ తులసి మొక్కను పెట్టుకుంటే ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

 

అయితే కొంతమంది అయితే రామ తులసి,కృష్ణ తులసి మొక్కలలో ఏ మొక్క ఎలా కనుక్కోవడం అనేది కూడా తెలియదు. రామ తులసి మొక్క పచ్చని ఆకులను కలిగి ఉంటుంది. కాండం కూడా పచ్చగా ఉంటుంది. మంచి సువాసన వస్తుంది. రామ తులసి ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. రామ తులసి ఆకులు కాస్త తియ్యగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కృష్ణ తులసిలో ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటి ఆకులు ఊదా లేదా కాస్త నీలి రంగులో ఉంటాయి. ఈ చెట్టు కాడలు కూడా ఉదా రంగులో ఉంటాయి. కాబట్టి ఇంట్లో రామ తులసి,కృష్ణ తులసి రెండు రకాల మొక్కలను పెంచుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -