Holy Basil: తులసి మొక్క విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.. డబ్బే డబ్బు?

Holy Basil: భారతదేశంలో హిందువుల ఇండల్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర తప్పకుండా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగించడంతోపాటుగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెంక్కించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది తులసి మొక్క విషయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో తులసీదేవి అలాగే లక్ష్మీదేవి కోపానికి కారకులు అవుతాం. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించి సాయంత్రం సమయంలో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే తులసి మొక్కకు చాలామంది ఇష్టం వచ్చిన విధంగా ఎప్పుడు పడితే అప్పుడు నీరు పోస్తూ ఉంటారు.

 

కానీ తులసి మొక్కకు నీరు పోయడంలో కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకడం అన్నది పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి తులసి మొక్కకు ఎప్పుడు స్నానం చేసిన తర్వాత మాత్రమే నీటిని పోయాలి. ఇది చాలా మంది తులసి మొక్కకు నీళ్లు సమర్పించే ముందు ఎటువంటి ఆహరం తినకూడదని చెబుతూ ఉంటారు. అలాగే ఎట్టి పరిస్థితులలో ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఆదివారం రోజున తులసి దేవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి మొక్కకు నీరు పోయడం వల్ల తులసి దేవి విశ్రాంతికి భంగం కలిగించినట్టు అవుతుంది. అదేవిధంగా ఆదివారం నాడు కాకుండా ఏకాదశి నాడు కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు.

 

ఎందుకంటే ఏకాదశి రోజున తులసి దేవి విష్ణువు కోసం వ్రతాన్ని చేస్తూ ఉంటుంది.. అటువంటి సమయంలో నీరు పోయడం వల్ల వ్రతానికి భంగం కలిగించిన వారు అవుతాం. అదేవిధంగా సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీరు పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఎప్పుడూ కూడా తూర్పు దిశలోనే నాటాలి. అలాగే ఈశాన్య దిశలో కూడా నాట వచ్చు. అయితే తులసి మొక్కకు సమర్పించేటప్పుడు ఒక మంత్రాన్ని జపించడం వల్ల తులసి మొక్కకు పూజా చేసిన ఫలితంతో పాటు ఐశ్వర్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ‘‘మహాప్రసాదం జననీ, సర్వ సౌభాగ్యవర్ధిన ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే’’ అన్న మంత్రాన్ని జపిస్తూ నీరును సమర్పించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అలాగే తులసి దేవి అనుగ్రహం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -