UPI Transactions:‘యూపీఐ’ నుంచి రోజుకు ఎంత ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు తెలుసా!

UPI Transactions: ఒకప్పుడు డబ్బులు ఇతరులకు పంపాలన్నా.. జమ చేయాలన్నా బ్యాంకులకు వెళ్లి వరసలో నిలబడి ఆ ప్రక్రియను పూర్తి చేసేవారు. నేటి కాలంలో అందుబాటులోకి వచ్చిన ‘యూపీఐ’ యాప్స్‌లతో అన్ని కానిచ్చేస్తున్నారు. ఈ యాప్‌లతో లావాదేవీలు జరుపుతుండటంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతున్నాయి. నేటి కాలంలో ఇలాంటి యాప్‌లు వాడని వారుండరు. కొన్ని క్షణల్లోనే ఇతరుకు డబ్బు పంపవచ్చు.. వారి నుంచి మనం డబ్బు పొందవచ్చు. ఇలా యూపీఐ ద్వారా గత నెల ఆగస్టులో రూ. 657 కోట్ల లావాదేవీలు జరిగాయంటే యూపీఐ వాడకం ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

ఎన్‌పీసీఐ యూపీఐను తీసుకురాగా ఐఎంపీఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దీన్ని రూపొందించారు. ప్రస్తుతం పేటీఎం, ఫోన్‌పే భీమ్‌ యూపీఐ, గూగుల్‌ పే లాంటి వివిధ రకాల యూపీఐ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక బ్యాంకులు కూడా వాటి సొంత యూపీఐ యాప్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే ఆర్బీఐ, ఎన్‌పీసీఐ మాత్రం యూపీఐ లావాదేవీలకు లిమిట్‌ ఉంటుంది. మినీమం లిమిట్‌ అంటూ ఏమీ లేదు. గరిష్ట పరిమితి మాత్రం రూ. 2 లక్షల వరకు ఉంది. అలాగే బ్యాంకులు వాటి కస్టమర్లకు సొంత లిమిట్‌ను కూడా సెట్‌ చేయొచ్చు. అందుకే ఒక్కో బ్యాంక్‌లో ఒక్రో లిమిట్‌ ఉంటుంది.

ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు అయితే రోజుకు రూ. లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. ఐసీఐసీఐ కస్టమర్లు రూ. 25 వేలు, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ కస్టమర్లు రూ.లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. కెనరా బ్యాంక్‌ లిమిట్‌ రోజుకు రూ. 25 వేలు ఉంది. దేనా బ్యాంక్, సిటీ బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కస్టమర్లు కూడా రూ.లక్ష వరకు మనీ ఇతరులకు పంపించే సదుపాయం కల్పించాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులు అయితే రోజుకు రూ. 50 వేలు పొందొచ్చు. బ్యాంకుల యూపీఐ రోజూ వారి లిమిట్‌ ఒక్కోలా ఉంటుంది. అంటే రోజుకు రూ. లక్ష వరకు పంపొచ్చని ఉంటుంది. అయితే ఒకేసారి రూ. లక్ష పంపడం వీలు కాదు.లావాదేవీలకు మాత్రం ఓ లిమిట్‌ తక్కువగా ఉండొచ్చు. అందుకే యూపీఐ లిమిట్‌ అనేది రెండు రకాలు ఉంటుందని మనం గ్రహించాలి. కొన్ని బ్యాంకులు ఒకేసారి రూ.లక్ష వరకు  పంపే వెసులుబాటు కల్పిస్తుంటాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -