UPI Transactions: మీ డబ్బులు పొరపాటున వేరే వ్యక్తికి పంపారా.. ఇలాచేస్తే తిరిగి పొందవచ్చు

UPI Transactions: ఒకప్పుడు డబ్బులు జమచేయాలన్నా.. డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంకులకు వెళ్లి, ఫారాలు నింపి వరసల్లో నిలబడితేనే ఆ పని అయ్యేది. అయితే సాంకేతి పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇప్పుడు లావాదేవీలన్నీ ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా సెకన్లలోను టాన్సఫర్‌ చేస్తున్నాం. ఇలా చేయడం కొంత వరకు సౌకర్యవంగా ఉన్నా కొన్నిసార్లు తప్పులు జరిగి తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీలు అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో చాలా అధిక సంఖ్యలో ప్రజలకు తెలియదు. అయితే.. డబ్బులు ఇతరులకు వెళ్లినా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని అనువైన మార్గాల ద్వారా ఇతరుకు పంపిన డబ్బులను తిరిగి పొందవచ్చు. అయితే.. ఇందులో కొంత అధిక సమయం పట్టొచ్చు దాదాపు 1–2 నెలలు కూడా పడుతోంది.

మీరు ఎప్పుడైతే తప్పుడు ఖాతాకు డబ్బులు పంపారో వెంటనే మీ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌చేసి ఈ విషయం తెలిపి ఎంత పంపిచారు.. ఎలా పంపిచారో అనేది వారికి స్పష్టంగా అర్థమయ్యేలా స్క్రీన్‌ షాట్‌ను పంపించాలి. లేదా నేరుగా బ్యాంక్‌కు వెళ్లిన మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. మీరు చేసిన రిక్వెస్ట్‌కు బ్యాంకు యాక్షన్‌ తీసుకోవడం ప్రారంభిస్తోంది. మీరు తప్పుడు యూపీఐ ఐడీకి పంపినప్పుడు అది నిజంగా లేని పక్షంలో మీ డబ్బు ఆటోమేటిక్‌గా మీ ఖాతాలోకి వస్తాయి. తప్పుడు ఖాతాకు డబ్బులు పంపిస్తే ఎలా పంపించారు.. ఎంత పంపించారు. అందుకు సంసబంధించిన ప్రూఫ్‌లను మీ బ్యాంక్‌ అధికారులకు తెలపాలి. ఇది ఇంటర్‌ బ్యాంక్‌ లావాదేవీ అయితే మీ తరఫున బ్యాంకు రిసీవర్‌ బ్యాంకుకు ట్రాన్సాక్షన్‌ సంబంధిత అన్ని వివరాలను అందించి మీ డబ్బు మీరు తిరిగిపొందేలా సహాయం చేస్తుంది.

వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే సమీపంలోని బ్రాంచ్‌ను రిసీవరీ కోసం సంప్రదిస్తుంది. ఖాతాదారుడి పేరు, బ్రాంచ్, మొబైల్‌ నంబర్‌ ఇతర అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మీరు రిసీవర్‌ బ్రాంచ్‌కి వెళ్లి నేరుగా మేనేజర్‌తో మాట్లాడి రిక్వెస్ట్‌ చేయవచ్చు. బ్యాంక్‌ మేనేజర్‌ డబ్బు పొందిన వ్యక్తితో మాట్లాడి మీరు పంపిన డబ్బును ఇవ్వాలని అడుగుతాడు. ఒకవేళ ఎదుటి వ్యక్తి అంగీకరించకుంటే న్యాయ సహాయం తీసుకోవాల్సిందే. ఒకవేళ.. మీరు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎవరికైనా డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు బ్యాంక్‌ ఖాతా నంబర్‌తో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేయాలి. ఒక వేళ మీ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తప్పుగా ఉంటే మీ డబ్బు 24– 48 గంటల్లోపు మీ ఖాతాలో పడుతోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -