Sreeleela: టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఒక్కరోజు షూటింగ్ కు రాకపోతే ఏకంగా అన్ని రూ.కోట్ల నష్టమా?

Sreeleela:  శ్రీ లీల.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ లో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ గా రాణిస్తోంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటించిన కేవలం రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం అర డజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీగా అవకాశాలను అందుకోవడంతోపాటు యువత క్రష్ గా మారిపోయింది.

మరి ముఖ్యంగా ఈమె నటన డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. శ్రీలీల సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అంటున్నారు మేకర్స్. మన తెలుగు హీరోలు కూడా తమ సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్ గా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తన కన్నా డబల్ ఏజ్ ఉన్న హీరోలు సైతం శ్రీలీలనే తమ సినిమాలో నటింపజేయాలంటూ మేకర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే మా రెమ్యునరేషన్ తగ్గించి ఆమెకు ఇచ్చైనా సినిమాలో చేయించాలని కోరుతున్నారు.

అయితే ఇలాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ గల శ్రీలీల గనుక ఒక్క రోజు షూటింగ్ కి రాకపోయినా ఏదైనా హల్త్ ఇష్యూ వచ్చి డుమ్మాకొట్టిన మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా ఉండే శ్రీలీల చదువు పనిమీద కానీ లేదా వేరే ఇతర ఏ పని మీద అయినా ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయంటున్నారు. సదరు స్టార్ హీరోల క్వాల్షీట్స్ వేస్ట్ అయిపోతాయంటున్నారు. అందుకే శ్రీ లీల నిర్మాతలకి నష్టాలు రాకుండా పగలు షూటింగ్స్ రాత్రి పరీక్షలకు చదువుకుంటుందంటూ శ్రీలీలను ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -