Husband-Wife: భార్యాభర్తల బంధం బలపడాలా.. అయితే ఇలా చేయండి?

Husband-Wife: భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఆడపిల్లలు పుట్టింట్లో 25 ఏళ్ల జీవితాన్ని గడిపితే మిగిలిన జీవితం మొత్తం మిట్టినింట్లో గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు ఒక ప్రపంచంలో బతికిన ఆడపిల్లలు పెళ్లి అయిన తర్వాత మరొక ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటారు. కాబట్టి మెట్టినింట్లో అడుగుపెట్టే ఆడపిల్లను ఎంతో జాగ్రత్తగా ఆనందంగా, ప్రేమగా చూసుకోవాలి. భర్త ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే భార్యకు కూడా గౌరవం ఇవ్వాలి. అయితే ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు మొత్తం తారుమారువయ్యాయి. పెద్ద పెద్ద సిటీలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఆఫీసులలో ఒత్తిడిని ఒకరిపై ఒకరు చూపించుకుంటూ వైవాహిక జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు.

 

ఆ ఒత్తిడి భార్యాభర్తల బంధాన్ని నాశనం చేస్తుంది.. భార్యాభర్తల బంధం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి. భర్తలు వారి భాగస్వామితో బంధాన్ని బలపరుచుకోవాలి. ఎటువంటి కష్టమైనా కూడా ఒకరికి ఒకరు షేర్ చేసుకోవాలి. అయితే భార్యాభర్తల బంధం మరింత బలపడాలి అంటే ఇద్దరు కలిసి స్నానం చేయాలి అంటున్నారు నిపుణులు. చాలామంది ఈ విషయం వినగానే ఛీ అనుకుంటూ ఉంటారు. మీరు భార్యాభర్తలు కాబట్టి అలా స్నానం చేయడం తప్పు కాదు. భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల మీ మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుంది.

 

ఒకరితో ఒకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు. ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం వల్ల ఉద్యోగం పిల్లలు బాధ్యతల వల్ల అటువంటివి కుదరకపోవచ్చు. కానీ ఇన్ని బాధ్యతలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భార్యాభర్తల కన్నా ఈ లోకం ఏ బంధం ఏ బాధ్యత ఎక్కువ కాదు. కాబట్టి కొన్ని కొన్ని సార్లు పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆఫీసులకు సెలవు పెట్టి భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా భాగ్య స్వామితో మాట్లాడుకోవచ్చు. ఆఫీసుకు సెలవు పెట్టిన రోజున ఇతర పనుల కోసం కాకుండా భార్యాభర్తలు ఏకాంతంగా గడపడానికి ఉపయోగిస్తే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. కాసేపు సరదాగా గడపడం, కలిసి స్నానం చేయడం,ఇద్దరూ కలిసి వంటింట్లో పనుల్లో హెల్ప్‌ చేసుకోవడం,భోజనం చేసిన తర్వాత సరదాగా బయటకు వెళ్లిరావడం, ఇలా ప్రతి రోజూ చేయాల్సిన అవసరం లేదు. నెలలో ఇలా ఒకరోజు మీకోసం మీరు కేటాయించుకున్నా సరిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -