Divorce Party: భార్యల నుంచి విడాకులు పొందిన 18 మంది భారీ సెలబ్రేట్‌కు ఏర్పాట్లు

Divorce Party: సాధారణంగా ఏదైనా వేడుకనో, పెళ్లినరోజో, ఇంకేదైనా శుభకార్యం నిర్వహిస్తే అందరిని పిలిచి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తారు. లేదంటే ఏదైనా విజయం సాధించినప్పుడు సెలబ్రేట్‌ చేస్తారు. కానీ.. 18 మంది యువకులు వారి భార్యలతో విడాకులు కావాలని వేసిన కేసులో విజయం సాధించడంతో వారు చేసిన సెటబ్రేట్‌ అంతా ఇంతా కాదు. పెళ్లి, పుట్టిన రోజు వేడుకలకు ధీటుగా చేసి అందరినీ ముక్కులో వేలేసుకునేలా చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ వేడుక నిర్వహించేందుకు ఏకంగా పెళ్లి పత్రిక తరహాలో ఆహ్వాన పత్రికలను సైతం ముద్రించారు.

అంతేకాక ఆ కార్యక్రమంలో సంగీత్‌ను కూడా పెట్టించారు. పెళ్లి దండను తీసుకెళ్లి నిమజ్జనం చేయటం. ఏడడుగుల కార్యక్రమం, అగ్నిసాక్షి మంత్రాలు ఇవన్నీ మామూలు పెళ్లిలో జరిగే దానికి వ్యతిరేకంగా జరగనున్నాయి. భోపాల్‌కు చెందిన ఓ ఎన్జీఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 18న జరగనున్న ఈ వేడుకలో భారీస్థాయిలో డెకరేషన్‌ వేలాది మంది కూర్చునేలా ఏర్పాటు భారీ లైటింట్‌ తదితర వాటంనింటిని ఏర్పాటు చేశారు. భార్యలపై కేసు వేసిన ఆ 18మంది మగాళ్లకు తమకు విముక్తి కలగనున్న సందర్భంలో ఇలాంటి ప్లాన్‌ చేశారని నిర్వాహకులు తెలిపారు. కొత్త జీవితాలకు స్వాగతం పలుకటానికే ఈ వేడుకని అన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ‘విడాకుల మహోత్సవం’ తాలూకూ ఆహ్వాన పత్రిక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు స్పందిస్తూ.. ‘మీరు మగజాతి ఆణిముత్యాలు బ్రదర్స్‌’ ‘ముందు ముందు ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని మరికొందరు.’ ‘ పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. నూరేళ్ల మంట’ అంటూ ఇంకొందరు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -