Divorce: ఇండియాలో భార్యాభర్తలు విడిపోవడానికి అసలు కారణాలివే.. ఆ ఎఫైర్స్ కొంప ముంచుతున్నాయా?

Divorce: ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థపై యువతి యువకులలో పెద్దగా నమ్మకాలు లేకపోవడం అలాగే ఆసక్తి లేకపోవడం వల్ల కూడా చాలామంది విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు పెళ్లి జరిగితే కష్టనష్టాలైనా భర్తతో భార్య కలిసి జీవితాంతం ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు రోజు రోజుకు మన భారత దేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది అయితే ఇలా విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలు ఏంటి అని పలు అధ్యయనాలు నిర్వహించారు.

ఈ అధ్యయనాలలో భాగంగా అసలు ఎందుకు విడిపోతున్నారనే విషయం గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిటీ కల్చర్ కి అలవాటు పడినటువంటి వారు తమ మధ్య ఎమోషన్స్ ప్రేమ అటాచ్మెంట్ వంటివి లేకపోవటం వల్లే విడాకులు తీసుకుంటున్నామంటూ నిర్భయంగా చెబుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలలోకి వస్తే అక్కడ అబ్బాయి అమ్మాయి మధ్య సఖ్యత కుదరకపోవడం కారణం అలాగే అత్తవారింట్లో అమ్మాయి ఇమడ లేకపోవడం తరచూ వారితో గొడవపడి బయటికి రావడం వంటివి కారణాలుగా కనబడుతున్నాయి.

 

ఇక అబ్బాయి కూడా విడాకులు ఇవ్వడానికి అమ్మాయి గురించి ఎన్నో కారణాలు చెబుతున్నారు పెద్దవారు అంటే గౌరవం లేదు అహంకారమే ఎక్కువ వంటి కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారని ఈ అధ్యాయనాలలో బయటపడితే ఇక అర్బన్ ప్రాంతాలలోకి వస్తే ఇక్కడ ఒక మహిళ లేదా పురుషుడు ఇతరులతో అఫైర్స్ పెట్టుకోవడం వల్ల విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

 

పెళ్లికి ముందు కొందరితో ప్రేమ వ్యవహారాలు నడపడం పెళ్లి తర్వాత వారితో లేచిపోవడం వంటి సందర్భాల కారణంగా విడాకులు వస్తున్నాయి.అయితే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడుతో అక్రమ సంబంధాలు పెట్టుకుని దొరికిపోవడం వల్ల కూడా విడాకులు జరుగుతున్నాయి.దేశంలో బెడ్రూమ్ రీజ‌న్స్ తో కూడా కొంత శాతం విడాకులు న‌మోద‌వుతున్నాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఇక విడాకులకు మరో ప్రధాన కారణం డొమెస్టిక్ వ‌యొలెన్స్. ఫిజిక‌ల్ అబ్యూజ్ లేదా మెంట‌ల్ అబ్యూజ్. దీన్ని భ‌రిస్తూ కాపురాలు చేసే వారు భార‌త‌దేశంలో కొద‌వ‌లేదు. ఇలాంటి వారు కూడా విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -