Roja: అవమానించడానికే పిలిచారా… కన్నీళ్లు పెట్టుకున్న రోజా?

Roja:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగిన నిన్నటి తరం కథానాయక రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారంగా ఓ వెలుగు వెలిగి అనంతరం వెండితెరకు దూరమయ్యారు. ఇలా వెండితెరకు దూరమైనటువంటి రోజా రాజకీయాల వైపు వెళ్లారు.ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ విధంగా రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమానికి దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జడ్జిగా వ్యవహరించినటువంటి రోజా అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు.అయితే దసరా పండుగ సందర్భంగా మల్లెమాలవారు నిర్వహించినటువంటి దసరా వైభోగం అనే కార్యక్రమంలో రోజా ముఖ్యఅతిథిగా సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్ల పై సెటైర్లు వేస్తూ సందడి చేస్తున్న రోజా ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఇకపోతే చివర్లో రోజా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే తనని అవమానించారంటూ ఈమె మండిపడ్డారు. నన్ను అవమానించడానికేనా ఇక్కడకి పిలిచారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇలా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజా షో మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా రోజా వెళ్ళిపోతుండగా జబర్దస్త్ కమెడియన్లు తనని బ్రతిమాలుతున్నప్పటికీ ఆమె షో నుంచి వెళ్ళిపోయారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రోజా ఎందుకు హర్ట్ అయ్యారు ఈమె నిజంగానే హర్ట్ అయ్యారా లేకపోతే ప్రోమో కోసమే ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఈ ఈవెంట్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -