Pawan-Posani: పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తే నాకు డిపాజిట్లు రావు.. పోసాని సంచలన కామెంట్స్ విన్నారా?

Pawan-Posani: పోసాని కృష్ణమురళి.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి. ఈ మధ్య పోసాని తరచూ సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాను సినిమా ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ వారిని కూడా లెక్కచేయకుండా వారిపై విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇకపోతే పోసాని కథ కొంతకాలంగా వైసీపీకి మద్దతుదారుడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

 

కాగా సీఎం జగన్ పోసానిని ఏపీ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పోసాని ప్రస్తుతం వైసిపి పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు. దాంతో జగన్ని ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని. తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పోసాని తరచుగా పవన్ కళ్యాణ్ పై కూడా విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాము.కాగా
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీకి దింపేందుకు వైసీపీ సరైన కాండిడేట్ కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనితో పోసాని పేరు కూడా వినిపిస్తోంది.దీనిపై పోసాని తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బరిలోకి దిగేందుకు పోసాని సిద్ధంగా ఉన్నారనే రూమర్స్ పై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా నో చెబుతాను. ఎందుకంటే నేను అంత పిచ్చోడిని కాదు. నేను పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ ని కాదు. సామాన్యుడిని. పవన్ పై నేను పోటీ చేస్తే గెలిచేది అతడే. నాకు డిపాజిట్లు కూడా కష్టమే. అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను. అంత అమాయకుడిని కాదు అని పోసాని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు విషయంలో కూడా పోసాని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని నేను ఎప్పుడో హెచ్చరించాను. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. ఎన్టీఆర్ కే వెన్ను పోటు పొడిచిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఒక లెక్కా అని పోసాని పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -