Women: స్త్రీ సంతోషంగా ఉండకపోతే కుటుంబంలో అలా జరుగుతుందా?

Women: మహాభారతంలో భీష్ముడు పాత్ర అతి ముఖ్యమైనది. ఈయన అసలు పేరు దేవవ్రతుడు. ఈయన అష్ట వసువులలో అతి ముఖ్యమైన వాడు. ఈయన పాండవ పక్షపాతి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కౌరవుల పక్షాన యుద్ధం చేయవలసి వస్తుంది.

 

యుద్ధ సమయంలో అర్జునుని బాణాలకి నేలకొరిగినప్పటికీ ఆయన కోరుకున్నప్పుడే మరణాన్ని ఆహ్వానించే వరం పొందడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అంపశయ్యపై వేచి ఉన్న మహానుభావుడు భీష్ముడు. ఈయన అంపశయ్యపై ఉన్నప్పుడే ఆయన జ్ఞానం అపారమైనది.

 

ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని శ్రీకృష్ణుడు చెప్పటంతో కౌరవులు, పాండవులు వారి ధర్మ సందేహాలను భీష్ముడి ముందు ఉంచుతారు. వారి సందేహాలని తీర్చే క్రమంలో స్త్రీలను ఎలా చూసుకోవాలి అనే విషయం మీద కూడా పలు విషయాలని వివరించాడు భీష్ముడు.

ప్రతి కుటుంబంలోని స్త్రీని చాలా సంతోషంగా ఉంచాలి. కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు ఆ కుటుంబపు స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయి. ఒక స్త్రీ తెచ్చే చెడ్డపేరు అయినా, మంచి పేరు అయినా దానికి కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మహిళలు ఇబ్బంది పడే విధంగా పురుషులు ప్రవర్తించకూడదు.

 

స్త్రీల శాపం చాలా శక్తివంతమైనది అది పురుషుడిని నానా ఇబ్బందులకు గురిచేస్తుంది. స్త్రీని గౌరవింపబడిని సమాజం నాశనమవుతుంది. అందుకు రామాయణమే ఉదాహరణ గర్భంతో ఉన్న స్త్రీలను, పేద కుటుంబానికి చెందిన స్త్రీలను ఇంకా ఎక్కువ మర్యాద చేయాలి.

 

ఒక స్త్రీ మనకి రక్తసంబంధీకురాలు కాకపోయినా ఆమె ఆపదలో ఉన్నప్పుడు ఒక పురుషుడు కచ్చితంగా ఆమెకి రక్షణ కల్పించాలి. కలియుగానికి ముందు యుగాలైనా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకి గౌరవం సమాజంలో రక్షణ ఎక్కువగా ఉండేది.

 

స్త్రీలను సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశ గా కొలిచేవారు. ఆ యుగంలోనే సీత, ద్రౌపతి, పార్వతి వంటి ఎంతోమంది స్త్రీలు మహా పతివ్రతలుగా పేరుపొంది చరిత్రలో నిలిచిపోయారు. కానీ నేటి సమాజంలో అందుకు విరుద్ధంగా స్త్రీలకు సరైన ఆదరణ లభించడం లేదని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -