Lobo: ఒక మంచి తల్లికి పుడితే భోళా శంకర్ పై బ్యాడ్ కామెంట్స్ రాయరు.. లోబో ఏం చెప్పారంటే?

Lobo: మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది అంతేకాకుండా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు.

ఇలా ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రెటీలు ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్లపై స్పందించారు అయితే తాజాగా ఈ సినిమాలో నటించినటువంటి నటుడు లోబో కూడా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్లపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ…

 

ఈ సినిమా గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటే వారు ఒక మంచి తల్లికి పుట్టిన వారు కాదు అంటూ ఈయన తెలిపారు.ఒక మంచి తల్లికే కనుక పుట్టి ఉంటే మీరు ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయరని తెలిపారు. ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన నాపై కూడా చాలా బాడ్ కామెంట్ చేస్తున్నారని తెలియజేశారు ఆయన ఇలా ఒక సినిమా గురించి చెడుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని తెలిపారు.

 

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారు మీకు ఏమాత్రం తెలియదు. ఎందుకు చెత్త కామెంట్లు రాస్తున్నారో అర్థం కావడం లేదని లోబో వెల్లడించారు.
బ్యాడ్ కామెంట్లు చేసేముందు ఒకసారి ఆలోచించాలని ఒక మంచి తల్లికి పుడితే ఈ విధంగా బ్యాడ్ కామెంట్లు రాయరని ఆయన కామెంట్లు చేశారు.ఇలా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్లపై స్పందిస్తూ లోబో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -