Jagan-Chandrababu: తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం.. పచ్చ మీడియా నీతి ఇదేనా?

Jagan-Chandrababu: ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మాటలు ప్రవర్తన అర్థం కావడం లేదు. తాను మాట్లాడితే తప్పులేదు కానీ మరొకరు మాట్లాడితే మాత్రం దానిని తప్పుగా పరిగణిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి మన విద్యారంగంలో ఉండాలనే అభిలాషం.. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల విధానాలను మన విశ్వవిద్యాలయాల్లో తీసుకురావాలనే ఆశ. అయితే వీటిని వ్యక్తం చేసినది ఏ చంద్రబాబునాయుడో అయి ఉంటే టీడీపీ హడావుడి మొత్తం ఇంకో లెవెల్లో ఉండేది. బాబుని అమాంతం పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండేవారు.

 

టీడీపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తితే సంతోష పడినవారు అవే పదాలను జగన్ కు వాడే సరికి ఆ భావాలను దృక్పథాన్ని దార్శనికతగా ఒప్పుకోవాలంటే వారికి మనసు రావడం లేదు. జగన్ వైఖరి మీద బురద చల్లాలని చూస్తున్నారు. ఎంతసేపు జగన్ మీద వైసీపీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక్కడ కూడా పాజిటివ్ గా రెండు విషయాలను కూడా మాట్లాడడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉన్నత విద్యకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, పాఠశాల స్థాయిలోనూ మరో బోర్డు ఏర్పాటు చేసి రెండింటినీ అనుసంధానం చేయడం ద్వారా విద్యారంగంలో అద్భుతాలు సృష్టించగల అవకాశాలను గురించి ఆయన వారితో చర్చించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తిగా వినియోగించుకోవాలని, ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు రాయించే తీరు రావాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే నిజానికి ఇదంతా అభినందించి తీరాల్సిన సంగతి. జగన్ సీఎం అయిన తర్వాత విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిషు మీడియంను అందుబాటులో ఉంచుతూ, సీబీఎస్ఈ విధానం తీసుకువస్తూ ప్రపంచస్థాయి విద్యను అందుబాటులో ఉంచుతున్నారు. మన విద్యార్థులను విదేశీ చదువులకు అనువైన విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల స్థాయిలోనే జీఆర్ఇ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధులను చేసే ప్రణాళికలకు రూపకల్పన చేశారు. వీటన్నింటినీ ఇప్పటివరకు విద్యారంగంలో ఎవరు ఊహించని మార్పులు.

 

పాఠశాల స్థాయిలో తీసుకువస్తున్న అత్యంత ఆధునిక విద్యావిధానాలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయాలను కూడా అందుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు జగన్ వీసీల సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి వర్సిటీల స్థాయిలో తీర్చిదిద్దాలనే తన కలలను వివరించారు. వాటిని చేరుకోవడానికి కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. కొంతదూరం ప్రయాణం అవసరం కొంతకాలం పడుతుంది. అయితే పచ్చమీడియా మాత్రం దీనిపై విమర్శలు ప్రారంభించింది. ఇప్పుడు వర్సిటీల్లో అధ్యాపకుల కొరత ఉన్నదని, నిధులు విడుదల చేయడం లేదని అయిన వారినే వీసీలుగా నియమిస్తున్నారని రకరకాల వక్రభాష్యాలతో జగన్ అసలు లక్ష్యం ఏమిటో ప్రజలకు అర్థం కాకుండా విషప్రచారం చేస్తోంది. వర్సిటీల్లో సమస్యలను తెలియజెప్పడం మంచిదే. కానీ జగన్ కలల విషయంలో అపశకునాలు పలుకుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -