Junior NTR: భార్యపై కోపం వస్తే జూనియర్ ఎన్టీఆర్ అలా చేస్తారా.. ఎన్టీఆర్ ప్లాన్ భలే ఉందిగా?

Junior NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భార్య పిల్లలతో కలిసి అప్పుడప్పుడు వెకేషన్ లకు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు తన భార్య ప్రణతి గురించి చెప్పుకొస్తూ ఉంటారు. గతంలో తన భార్యకు సంబంధించిన విషయాలను, తనకు సంబందించిన విషయాలను చాలా ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే.

 

కాగా ఎన్టీఆర్ కు కోపం ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కి కోపం వచ్చినప్పుడు తనంతట తాను వంటగదిలోకి వెళ్లి తనకు నచ్చిన ఫుడ్ ని చేసుకుని తింటారట. అయితే ఒకవేళ తన భార్య ప్రణతి పై కోపం వస్తే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటారట. అంతే కాకుండా ప్రణతి వచ్చి సారీ చెప్పేవరకు సైలెంట్ గా ఉంటారట. అదే సమయంలో తప్పు తనది అయితే మాత్రం ఎన్టీఆర్ వెంటనే సారీ చెబుతారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -