Tamannaah : ఆ సీన్స్ లో నటించకుంటే నన్ను ఆంటీని చేసేస్తారు.. తమన్నా బోల్డ్ కామెంట్స్!

Tamannaah : టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా తనతో పాటు ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హీరోయిన్స్ అందరూ అడపదప సినిమా అవకాశాలను అందుకుంటు ఉండగా తమన్న మాత్రం వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె నటించిన చిత్రాలు రెండు వరుసగా ఒక రోజు వ్యవధిలోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఆగస్టు 10వ తేదీ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా 11వ తేదీ చిరంజీవి భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ క్రమంలోనే తమన్న ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి తమన్న తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా తమన్నకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఈ మధ్యకాలంలో తమన్న కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తమన్నను ప్రశ్నించడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.కెరియర్ లో ముందుకు కొనసాగాలి అంటే కొన్నిసార్లు మన ఆలోచన ధోరణి మార్చుకోవాల్సి ఉంటుందని ఈమె తెలియజేశారు.

తాను కెరియర్ లో అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్లాలని భావించాను అయితే ఇలా తనను ప్రేక్షకులు ఆదరించాలి అంటే ఇలాంటి సీన్లలో నటించడం తప్పు లేదని తెలిపారు. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఉన్నట్టే మా కెరియర్ లో కూడా ఇది ప్రమోషన్ లాంటిదేననీ తెలిపారు. ఇలాంటి సీన్లలో కనుక నేను నటించక పోయి ఉంటే నన్ను ఈపాటికి స్టార్ హీరోల పక్కన ఆంటీని చేసేసేవారు అంటూ ఈ సందర్భంగా తమన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -