ChandraBabu-KCR: బాబు పరిస్ధితే కేసీఆర్ కు పడుతుందా? సీన్ రివర్స్ అవుతుందా?

ChandraBabu-KCR: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గతే వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు పడుతుందా? అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసినట్లుగానే కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నారు. బీజేపీపై విరుచుకుపడుతు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీపై ఒంటికాలిపై లేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ను అధికార పీఠం నుంచి దించేందుకు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను, నేతలను కలుస్తున్నారు. మోదీ వ్యతిరేక విధానాలపు తెలియజేస్తూ నేతలందరినీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే గోడుకు కిందకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు.

ప్రత్యేక విమానంలో తిరుగుతూ అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే ఇక మోదీని ఢీకొట్టేందుకు కేంద్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నారు. అయితే ఇంకా కొత్త రాజకీయ పార్టీలపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ లీకులు ఇచ్చినా.. దానిపై ఇప్పటివరకు ఎలాంటి అడుగులు పడలేదు.

ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ వెళ్లి అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఇక ఇటీవల వినాయక చవితి పండుగ రోజు బీహార్ వెళ్లి సీఎం నీతిష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇలా అన్ని రాష్ట్రాలనూ తిరిగిస్తూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన పనినే ఇప్పడు కేసీఆర్ చేస్తున్నారు. చంద్రబాబు తనకు బద్ద శత్రువైన కాంగ్రెస్ ను కూడా కలుపుకుని మోదీని ఎదిరించేందుకు చూశారు. కానీ చంద్రబాబు బోల్తా పడ్డారు. అటు కేంద్రంలో రెండోసారి మోదీ అధికారం చేపట్టగా.. రాష్ట్రంలో టీడీపీ 23 సీట్లను మాత్రమే గెలుచుకుని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న కేసీఆర్ కూ కూడా వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు గతే పడుతుందా అనే ప్రశ్నలు సాధారణంగా ఉత్పన్నమవుతున్నాయి. గత ఎన్నికల కంటే ముందు పోలిస్తే ఇప్పుడు బీజేపీ మరింత బలంగా ఉంది. దక్షిణాదిలో కర్ణాకటలో కూడా బీజేపీ పాగా వేసింది. తెలంగాణలో కూడా బలం పుంజుకుంది. ఇలాంటి క్రమంలో బీజేపీని ఎదుర్కొవడం అంటే కత్తి మీద సామేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ, అమిత్ షా అనుకుంటే ఏమైనా చేయగలరు. అందువల్ల కేసీఆర్ ను రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా ఏపీలో టీడీపీ పరిస్ధితిలా మారిపోతుందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -