NTR: ఎన్టీఆర్ అడుగుపెడితే చరిత్ర మారాల్సిందే.. అదే టాలెంట్ అంటూ?

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు, అభినయం నటన హవా భావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. తాతకు తగ్గ మనవుడిగా మరోసారి పౌరాణిక పాత్రలో నటించే నేటి తరానికి ఎన్టీఆర్ ఇంత బెస్ట్ అనేది నిరూపించుకున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీని చీతాతో పోల్చడం.. సెంటిమెంట్ సీన్లలో ఎన్టీఆర్ నటన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తనలోని షేడ్స్ చూపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. అలాగే ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా కూడా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. చెల్లెలే ప్రాణంగా ఎన్టీఆర్ చేసిన నటన అందరినీ ఆకట్టుకుంటుంది.

 

ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ తనలోని నటనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు. సినిమాలో పాత్రను ఎలివేట్ చేస్తూ ఉన్న డైలాగులను అలవోకగా పలికి సన్నివేశాన్ని హైలైట్ చేశాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ కు మహిళాదరణ ఎక్కువగా దక్కిన సినిమాగా రాఖీని చెప్పాలి. బృందావనం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు ఎన్టీఆర్. విడిపోయిన అన్నదమ్ములను కలుపుతూ, ఇద్దరు అమ్మాయిల మధ్య ఇబ్బందిపడే పాత్రలో ఎన్టీఆర్ అను ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది. లుక్ లో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించడం హైలైట్ అని చెప్పవచ్చు.

 

కామెడీ టైమింగ్ అదుర్స్ స్టార్ హీరో కామెడీ చేస్తే సినిమా ఏస్థాయికి వెళ్తుందో అదుర్స్ తో ఎన్టీఆర్ నిరూపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కామెడీ అదుర్స్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటించిన వైవిధ్యమైన క్యారెక్టర్లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించాడు అనేకంటే అదుర్స్ లో చారిగా ఎన్టీఆర్ జీవించాడనేది సరైన మాట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏ పాత్ర అయినా ఎన్టీఆర్ దిగనంత వరకు మాత్రమే. ఎన్టీఆర్ ఒక్కసారి బరిలోకి దిగితే చరిత్ర మారాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -