Pregnant: గర్భిణీలు కాఫీ తాగితే పిల్లలు అలా పుడతారా.. ఇందులో నిజమెంత?

Pregnant: స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ ప్రస్తుత సమాజంలో అనేక రకాల కారణాల వల్ల చాలా మంది ఆడవారు తల్లి అవ్వలేకపోతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలు గర్భం నిలబడిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చేసే పనుల విషయంలో గర్భవతులు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రస్తుత కాలంలో చాలా మంది గర్భవతులు వారికి తోచిన విధంగా ఆహారాలు తీసుకొని లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం తోపాటు కడుపులోని బిడ్డలకు కూడా హాని కలిగిస్తున్నారు.

 

గర్భవతులు తమ ఆరోగ్యంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దుష్టులో ఉంచుకొని ఆహారపు అలవాటులను పాటించాల్సి ఉంటుంది. లేదంటే గర్భవతులు తీసుకునే ఆహారం పుట్టే పిల్లలపై పడుతుంది. ఇది చాలామందికి పుట్టే బిడ్డలలో బరువు తక్కువగా బక్కగా లావు తక్కువగా ఇలా వివిధ లోపాలతో పుడుతూ ఉంటారు. కాబట్టి పుట్టే బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఆహారం విషయంలో గర్భిణీ స్త్రీలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది గర్భిణీలు కాఫీలను టీ లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా కాఫీ తాగటం అన్నది గర్భిణీలు మానేయాలి.

 

ఎందుకంటే రోజుకు అర కప్పు టీ, కాఫీ, సోడా అలాగే ఏదైనా ఎనర్జీ డ్రింకులు తాగితే పుట్టే బిడ్డలు ఉండాల్సిన పరిమాణం కంటే తక్కువగా జన్మిస్తారు. తినకుండా పిల్లలు పెద్దయిన తర్వాత స్థూలకాయం గుండె షుగర్ వంటి జబ్బుల బారిన పడతారు అని అధ్యయనంలో తేలింది. గర్భిణీ స్త్రీలు కాఫీ తీసుకోవాలి అనుకుంటే వైద్యుల సలహా మేరకు కాఫీ తీసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గర్భిణీగా ఉన్నప్పుడు కాఫీలకు టీలకు దూరంగా ఉండటం మంచిది. వైద్యులు ఒక అధ్యయనంలో అందరూ గర్భవతులకు పుట్టే పిల్లలను పరిశీలించగా అందులో కాఫీ తాగే అలవాటున్న గర్భిణిలకి పుట్టిన పిల్లలు కాఫీ తాగే అలవాటు లేని గర్భిణిలకు పుట్టిన పిల్లలతో పోల్చితే బరువు 84 గ్రాములు తక్కువ, ఎత్తు 0.44 సెంటీ మీటర్లు తక్కువ, తల సైజు 0.28 సెంటీ మీటర్లు తక్కువ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలా ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే..
గర్భిణిలు కాఫీ తాగటం వల్ల పిండంలోని రక్త నాళాలు కుచించుకుపోయి రక్త సరఫరా తగ్గిపోతుంది. గ్రోత్ హార్మోన్లు విడుదలకూ ఆటంకం కలుగుతుంది. తద్వారా పిండం పెరుగుదల దెబ్బతింటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -