Relationship: గర్భిణీలు సెక్స్ చేస్తే అబార్షన్ అవుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Relationship: భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఆలుమగల మధ్య సెక్స్ వారి అన్యోన్యతను తెలియజేస్తుంది. అయితే చాలామంది భార్యాభర్తలకు సెక్స్ విషయంలో అనేక రకాల సందేహాలు అపోహలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా? గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ చేస్తే బిడ్డకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ చేస్తే అబార్షన్ అవుతుందా ఇలా ఎన్నో రకాల సందేశాలు వ్యక్తం అవుతూ ఉంటాయి? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భార్య భర్తలు చాలా మంది భార్యకు గర్భం నిలిచింది అని తెలిసిన తర్వాత నుంచి తొమ్మిది నెలలు దాటిన తర్వాత కూడా దూరంగానే ఉంటారు.

 

సెక్స్ గర్భస్రావానికి దారితీస్తుందనే భయంతో కొందరు మొత్తం తొమ్మిది నెలల పాటు విరామం కూడా తీసుకుంటారు. అయితే గర్భధారణ సమయంలో సన్నిహితంగా ఉండటం సురక్షితమైనది మాత్రమే కాకుండా దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుంది. బలమైన గర్భాశయ కండరాలు, అమ్నియోటిక్ ద్రవం, గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మం ప్లగ్ ఉండటం వల్ల సెక్స్ వల్ల బిడ్డకు ఎలాంటి హాని జరగదు. ప్రెగ్నెన్సీ సమయంలో భార్య అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలాగే కడుపులోని బిడ్డ గ్రోత్ బాగా ఉన్నప్పుడు వైద్యుల సలహా మేరకు కలవడం మంచిది. ఇంకా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో కలవాల వద్దా అన్న సందేహాలు వచ్చినప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

 

అయితే కొందరు మహిళలకు నెలలు నిండకముందే డెలివరీ అవుతూ ఉంటుంది. అయితే సెక్స్ చేయడం వల్లే అలా జరిగింది అనుకోవడం పొరపాటే. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. సెక్స్ ముందస్తు ప్రసవానికి దారితీయదు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వైద్యులు ముందే చెప్పినప్పుడు అలాంటి వారు మాత్రం సెక్స్ కి దూరంగా ఉండాలి. గర్భధారణ సమయంలో శృంగారంలో ఉన్న ఏకైక కష్టం సరైన స్థానాన్ని కనుగొనడం. బిడ్డ పెరుగుతుంటే పొట్ట కూడా పెరుగుతుంది. దీంతో మహిళలు సన్నిహిత సెషన్‌ను ఆస్వాదించడానికి సౌకర్యవంతమైన స్థానాన్ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి పొట్ట మీద ఎలాంటి ఒత్తిడి తగలకుండా జాగ్రత్తగా కలయికలో పాల్గొనడం ఉత్తమమైన మార్గం.గర్భం దాల్చిన తర్వాత చివరకు డెలివరీ వరకు అన్ని దశలలో సెక్స్ సురక్షితం. ఇది తల్లికి లేదా బిడ్డకు హాని కలిగించదు. అయితే, సెక్స్ సమయంలో లేదా దాని తర్వాత, గర్భిణీ స్త్రీకి ఏదైనా అసాధారణ నొప్పి లేదా రక్తస్రావం ఉంటే, ఆమె వెంటనే తన వైద్యుడిని సంప్రదించాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -