NTR: టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారా?

NTR: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇదిగో అదిగో అంటే వచ్చే ఏడాది వచ్చేస్తుంది. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి యువనేత నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసే అవినీతి అక్రమాలపై విరుచుకుపడుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన ఏపీకి మెుదటి సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతి రాజధానిగా ప్రకటించి పలు నిర్మాణాలు కూడా చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారు. ఒక్క వైసీపీ తప్ప దీన్ని ఎవరూ ఒప్పుకోవటం లేదు. అయినా విశాఖకు రాజధాని తరలింపు చేస్తామని మెుండిగా వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళ్తున్నాడు. దీన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తిప్పికొడుతోంది. ఈ ఒక్క అంశంలోనే కాకుండా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయంపై వివిధ ప్రోగ్రాంల ద్వారా టీడీపీ వివరిస్తోంది. అయితే లోకేశ్ దూకుడు చూస్తుంటే అందరికీ అశ్చర్యంతోపాటు ఒక ఆలోచన కూడా తడుతోంది.

వైసీపీ ఓడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా ఆ పార్టీ నేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ తో చర్చలు కూడా నడిపినట్లు సమాచారం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే పక్కాగా లోకేశ్ సీఎం అవుతారని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే బాహాటంగా చెబుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా గెలుపులో పాలుపంచుకుంటున్నారు కనుక, ఆయనకు కూడా రెండున్నరేళ్లు సీఎంగా చేసే అవకాశం ఇస్తారని చెబుతున్నారు. దీనిపై తారక్ అభిమాలు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -