Nandamuri Family: ఈ నందమూరి హీరో సక్సెస్ కావాలంటే ఆ ఒక్క పని చేయాలా?

Nandamuri Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నారు. యాక్టివ్ గా హిట్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో వారసుడు నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం సాగుతోంది. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన మూడవ జనరేషన్ లో అందరూ అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. చాలా వరకు అందరూ వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల్లోకి వస్తే మాత్రం బాలకృష్ణ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. బాలకృష్ణ స్టార్ హోదాను అందుకోగా ఆ తరువాత కళ్యాణ్ రామ్ బాగానే ప్రయోగాలు చేసినప్పటికీ ఇంకా ఒక నిలకడగా ఉండే మార్కెట్ ను సంపాదించలేదు. ఇక తారకరత్న నటుడిగా పరవాలేదు అనిపించగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ క్లిక్ అయ్యాడు. అయితే మూడవ జనరేషన్ లో మరో నందమూరి హీరో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

ఆయన ఎవరో కాదు నందమూరి తారక రామా రావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. వాస్తవానికి ఆయన ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. కానీ 2003 వ సంవత్సరంలోనే ఆయన ధమ్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట దమ్ అనే సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అసలు ఆయన సినిమా చేశాడు అనే విషయం కూడా ఇప్పటివరకు తెలియదు. దీంతో ప్రస్తుతం ఆయన మళ్ళీ డిఫరెంట్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు అన్నట్లుగా హడావిడి చేస్తూ ఒక సినిమా అయితే రూపొందుతోంది. వంశీకృష్ణ అఖిల దర్శకత్వంలో నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.

 

హాలీవుడ్ మూవీ లాంటి టైటిల్ తో పోస్టర్ లో చైతన్య ఇయర్ బర్డ్స్ పెట్టుకొని వర్షంలో గొడుగు పట్టుకొని నిలబడి సీరియస్ గా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాఫ్ చేసేలా కనిపిస్తోంది. వంశీకృష్ణ అఖిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ రాబిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

 

అయితే నందమూరి హీరోల్లో టాప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో తన రెంజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి వచ్చిస్తున్న ఈ హీరోకు కేవలం బాలకృష్ణ సపోర్టు ఉంటే సరిపోదు. జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు కూడా అవసరం అని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -