Trivikram: త్రివిక్రమ్ కు ఫ్లాపొస్తే ఇంతమందికి సంతోషమా.. ఏమైందంటే?

Trivikram: మామూలుగా ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూసి సంతోషపడే వారిని కంటే కుళ్ళుకునే వారు ఓర్వవలేని వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇలాంటి మనుషులు అన్ని రంగాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారండోయ్. సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది డైరెక్టర్లు సినిమాలు ఫ్లాప్ అయితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారట. తాజాగా ఒక దర్శకుడు చేసిన ట్వీట్ కూడా ఇలాగే ఉంది. ఒకరి ఫ్లాపుకు మీరు ఆనందిస్తే, మీ ఫ్లాప్‌కు వేరేకొరు ఆనందిస్తారు అనే అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఒక దర్శకుడు.

 

అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్‌కు ఫ్లాప్ వస్తే చాలా అంటే చాలా మంది ఆనందిస్తారు. అది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే త్రివిక్రమ్ వ్యవహారాలు అలా వుంటాయి మరి. ఒక పెద్ద బ్యానర్ అయినా అందరితో సినిమాలు చేయాలనుకుంటుంది. కానీ హారిక హాసిని బ్యానర్‌కు పెద్ద దర్శకులు అంతా దూరమే. కొరటాల శివ, సుకుమార్ ఇలాంటి టాప్ లైన్‌లో వున్నవారంతా అక్కడ సినిమాలు చేయరు. అందుకు గల కారణం ఆ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ కే. సితార బ్యానర్ లో చేస్తాము అనేది నిర్మాతలు పెట్టుకున్న ఒక పద్దతి. పవన్ కళ్యాణ్‌తో చేసిన భీమ్లా నాయక్ కూడా సితార బ్యానర్ నే. ఎందుకంటే దర్శకుడు త్రివిక్రమ్ కాదు కాబట్టి.

హారిక హాసిని పెద్ద బ్యానర్, సితార దాని సెకండరీ బ్యానర్. అందువల్ల ఇందులో చేయడం అన్నది కాస్త చిన్నగా ఫీల్ అవుతారు పెద్ద దర్శకులు అందరూ. కానీ హారిక హాసిని కావచ్చు, సితార కావచ్చు. ఇవన్నీ త్రివిక్రమ్ పుణ్యమే. ఆయన వల్లే హీరోలు వచ్చారు. సినిమాలు చేసారు. హిట్ లు చేసుకుని, కాస్త బలమైన బ్యానర్లుగా నిలబడ్డారు. సితారలో మంచి సినిమాలు వచ్చాయి. మంచి హిట్ లు వచ్చాయి. కానీ మిగిలిన పెద్ద దర్శకుల వరకు ఒక అభిప్రాయం వుంది. చేస్తే హారిక బ్యానర్ లో చేద్దాం. లేదంటే లేదు అని. అది వాస్తవం. తమకు అవసరమే లేదు అనే భావన హారిక హాసిని అధినేతలది. ఎందుకంటే వాళ్లకు త్రివిక్రమ్ కావాలి. అలాగే త్రివిక్రమ్‌కు నచ్చని వాళ్లు నటులు అయినా, సాంకేతిక నిపుణులైనా సరే, వాళ్లకి సితార, హారిక హాసిని సంస్థ సిన్మాల్లో అవకాశాలు వుండవు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా త్రివిక్రమ్ నే కంట్రోలు చేస్తున్నారనే గ్యాసిప్ వుంది.

 

మైత్రీ కి తీసుకున్న అడ్వాన్స్ ను వడ్డీతో సహా వెనుక్కు ఇవ్వాల్సి వచ్చింది త్రివిక్రమ్. అందుకే మైత్రీ-పవన్ సినిమా నత్తనడక నడుస్తోంది అనే గ్యాసిప్ కూడా వుంది. వీటన్నింటి వల్లా తనకు తెలియకుండానే త్రివిక్రమ్ చాలా మందికి కిట్టని దర్శకుడు అయ్యారు. త్రివిక్రమ్ కు తెలియకపోవచ్చు. ఇండస్ట్రీ దర్శకుల ఇన్ సైడ్ సర్కిళ్లలో ఆయనకు ఓ కోడ్ నేమ్ వుంది. అది శ్వేతనాగు.. కొంతమంది దర్శకులు నేరుగా త్రివిక్రమ్ అని మాట్లాడుకోకుండా శ్వేతనాగు అనే పదం వాడతారు అన్నది ఆ ఇన్ సైడ్ సర్కిళ్లకు దగ్గరగా వుండేవారికి తెలిసిన సంగతి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -