Trivikram: త్రివిక్రమ్ పని అయిపోయిందా.. ఇక మునుపటిలా ఆఫర్లు రావా?

Trivikram: టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుక తాజాగా భారీ అంచనాలను ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులను కూడా ఈ సినిమా భారీగా నిరాశపరిచింది. దీంతో మహేష్ బాబు అభిమానులు గురూజీ పై మండిపడుతున్నారు.

 

అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమా సినిమాలు పెద్దగా క్లిక్ అవడం లేదు. త్రివిక్రమ్ ప్రతి సినిమాలపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకోగా ఎప్పటికప్పుడు అభిమానులను నిరాశ పరుస్తూనే వస్తున్నారు త్రివిక్రమ్. దాంతో కొందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని అయిపోయినట్టే? ఇంతకుముందు లాగా సినిమా అవకాశాలు రావడం కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ శ్రీను వైట్ల కృష్ణవంశీ దారిలోనే త్రివిక్రమ్ కూడా నడుస్తున్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ‌తంలో హీరోల‌కే విజ‌యాహాంకారం ఉంటుంద‌ని, వారే తామేం తీసినా చెల్లుతుంద‌నే అభిప్రాయంతో ఉంటార‌నే టాక్ ఉండేది.

అయితే ఇప్పుడు హీరోలు చాలా వినయ‌పూర్వ‌కంగా మారారు. దర్శ‌కులు, ర‌చ‌యిత‌లు చెప్పింద‌ల్లా చేస్తూ ఉన్నారు. కండ‌లు పెంచ‌మ‌న్నా, క‌ష్ట‌ప‌డ‌మ‌న్నా, ఏం చేయ‌మ‌న్నా హీరోలు ద‌ర్శ‌కులు చెప్పింద‌ల్లా చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. అయితే హీరోల స‌మ‌యాన్ని వారి క‌ష్టాన్ని కూడా ద‌ర్శ‌కులు పెద్ద‌గా దృష్టి పెట్టుకున్న‌ట్టుగా క‌న‌ప‌డటం లేదు. పేప‌ర్ మీదే ప‌ర‌మ వీక్ గా ఉన్న సీన్ల‌తో వీళ్లు సెట్స్ మీద‌కు వెళ్లి మొత్తానికే కంగాళీ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -