Diabetes: తిన్న తర్వాత ఆ ఒక్క పని చేస్తే చాలు డయాబెటిస్ కంట్రోల్?

Diabetes: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మనుషుల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో రోజురోజుకీ ఈ డయాబెటిస్ వ్యాధి మారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇకపోతే డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చచ్చే వరకు పోదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం మాకిట్లోకి ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి.

షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు ఆరోగ్య చిట్కాలు అంటూ ఏవేవో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే షుగర్ కంట్రోల్ లో ఉండాలి అంటే తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు. మరి తిన్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. కానీ కావాల్సిన దానికంటే తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణగ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.

 

ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయితే, రక్తంలో గ్లూకోస్ స్థాయి పెరుగుతుంది. షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక సమస్య. దానిని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా రోజులో కాసేపు నడవాలి. ఇలా చేయడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఆహారం తీసుకున్నాక 5 నిమిషాలు నడిస్తే చాలు. దీంతో రక్తంలో గ్లూకోస్ పెరగకుండా నివారిస్తుంది. తిన్న తర్వాత రెస్టు తీసుకుంటే కార్బోహైడ్రేట్ల నుంచి తయారయ్యే శక్తి శరీరానికి పట్టదు. దీంతో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు శారీరక వ్యాయామంతో పాటు డయాబెటిస్ కంట్రోల్ చేసే ఆహారం తీసుకోవాలి. ఈ వ్యాధి ఉన్నవారు అధిక గ్లైసమిక్ ఇంటెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోరాదు. పుచ్చకాయ, అరటిపండు, ద్రాక్షలో అధిక గ్లైసిమిక్ ఉంటుంది. బియ్యం, బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అస్సలు తీసుకోరాదు. విటమిన్ సీ ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -